తిప్పనూ .. తిప్పనూ .. అంటూనే వెనకడుగి వేసి బోల్తా పడిన జగన్ !

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను తీసుకొనే కొన్ని నిర్ణయాలు కార్య రూపం దాల్చక పోవడంతో జగన్ మడమ తిప్పాల్సిన పరిస్థితి వస్తోంది. గతంలో 3 రాజధానుల నిర్ణయానికి మోకాలడ్డిన శాసనమండలిని రద్దు చేయాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశం పెట్టి శాసనమండలి ని బాగా తిట్టి పోసిన జగన్ దానికి రాజకీయ పునరావాస కేంద్రంగా పేరు కూడా పెట్టారు. అసెంబ్లీలో చదువుకోని వారు ఉంటేనే శాసనమండలి అవసరమని కానీ ఇప్పుడు అసెంబ్లీలో విద్యావంతులు ఉన్నారు కాబట్టి శాసనమండలి అవసరమే లేదని జగన్ చెప్పుకొచ్చారు. హస్తినకు వెళ్లిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలని కోరారు. శాసన మండలి రద్దు చేయాలని కేంద్రం ముందు తీర్మానం కూడా ఉంచారు కానీ కేంద్రం మాత్రం ఆ విషయం పై క్యాబినెట్ లో చర్చించలేదు.

jagan
CM YS Jagan

జూన్ నెలలో అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల ప్రతిపాదనను పెట్టి ఆమోదం ముద్ర వేయించుకున్న జగన్ శాసన మండలి ని టార్గెట్ చేయడం మానేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటు, పండుల రవీంద్ర బాబు, జకియా ఖానూం లకు వరసగా ఎమ్మెల్సీ పదవిలు కట్టబెట్టారు జగన్. తిరుపతి ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది.

దీన్ని బట్టి చూస్తుంటే శాసనమండలిని జగన్ కొనసాగించనున్నారు అని స్పష్టమవుతోంది. గుంటూరు జిల్లా కి చెందిన మర్రి రాజశేఖర్ కి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ నిశ్చయించుకున్నారు. మొత్తానికి శాసనమండలిలో వైసీపీ నేతలకు ఎన్నో పదవులు కట్టబెట్టి దానిని కొనసాగించడానికి జగన్ దృఢంగా నిశ్చయించుకున్నారు. మొదట్లో శాసనమండలిని రద్దు చేయాలని చెప్పిన జగనే ఈ విషయం లో ఈరోజున తన మడమతిప్పారని చెప్పుకోవచ్చు.

Advertisement