YS Jagan Mohan Reddy : పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్
NQ Staff - June 8, 2023 / 06:28 PM IST

YS Jagan Mohan Reddy : తెలుగు దేశం పార్టీ హయాంలో రైతుల నుండి ఉద్యోగుల వరకు అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన విషయం తెల్సిందే. పాద యాత్ర సమయంలో తాను అధికారంలోకి వస్తే చేస్తాను అంటూ ఇచ్చిన హామీల్లో 99.50 శాతం పూర్తి చేయడం జరిగింది. తాజాగా జగన్ మరో ముఖ్యమైన హామీని నెరవేర్చడం జరిగింది. పాద యాత్ర సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తానంటూ హామీ ఇచ్చాడు.
ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాడు. తెలుగు దేశం పార్టీ పట్టించుకోని కాంట్రాక్ట్ ఉద్యోగుల పాలిట దేవుడి మాదిరిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచాడు అంటూ వైకాపా నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఆర్టీసి, పాలిటెక్నిక్, విద్య, మెడికల్ , వైద్యం వంటి రంగాల్లో పెద్ద ఎత్తున సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తుండగా వారి పట్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి వారి సర్వీస్ రెగ్యులర్ చేయడం జరిగింది.
2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారందరికీ ఈ క్రమబద్దీకరణ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. కటాఫ్ తేదీని 10 సంవత్సరాలు ఉంచాలని అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే సీఎం జగన్ మోహన్ రెడ్డి మంచి మనసుతో క్రమబద్దీకరణకు అయిదు సంవత్సరాల కటాఫ్ తేదీని ఖరారు చేయడం జరిగింది.
పాద యాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా ఒకొక్కటి చొప్పున తీరుస్తూ వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవ్వని హామీలను కూడా తీర్చాడని.. గతంలో ఇతర పార్టీలు ఏవీ కూడా ఇంతగా హామీలను అమలు చేసిన దాఖలాలు లేవు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని వైకాపా నాయకులు ప్రశంసిస్తున్నారు.
ఇది కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లింది అంటూ వైకాపా నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క పెన్షన్ స్కీమ్ పై కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

YS Jagan Mohan Reddy Promised Regularize Contract Employees
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన పెన్షన్ స్కీమ్ వల్ల విస్తృత ప్రయోజనాలు కలుగుతున్నాయి. కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ కన్నా ఇది మరింత మెరుగైన పథకం అని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఈ పథకం పెన్షన్ కు మరింత గ్యారెంటీ కల్పిస్తుంది. దీని అమలు తీరు సైతం సీపీఎస్‌లానే ఉంటుంది. ఉద్యోగి 10 శాతం ఇస్తే, దానికి సమానంగా ప్రభుత్వం ఇస్తుంది. రిటైర్ అయ్యే ముందు చివరి శాలరీలో బేసిక్‌లో 50శాతం పెన్షన్‌గా అందుతుంది.
సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్ అందే పెన్షన్ 150శాతం అధికం. రిటైర్ అయిన వ్యక్తి… చివరి నెల బేసిక్ జీతం రూ.1 లక్ష ఉంటే.. అందులో రూ.50వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి 2 డీఆర్‌లతో కలుపుకుని ఇది ప్రతిఏటా పెరుగుతూ పోతుంది. 62 సంవత్సరాలకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే.. రిటైర్ అయిన ఆ ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చే సరికి జీపీఎస్‌ద్వారా పెన్షన్ రూ. 1,10,000 కి చేరుతుంది.
దీంతో రిటైర్ అయిన ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుంది. వారి జీవన విధానానికి దెబ్బ లేకుండా, సంతోషంగా ఉండేలా ఈ రక్షణ చర్యలను జీపీఎస్‌లో తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఓపీఎస్ తీసుకు వస్తున్నామని ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. కాని, ఇది అమల్లోకి రాలేదు. కానీ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి తగ్గట్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వబోతున్నారు.