ys Jagan : మూడు రాజధానుల పేరిట ఏపీ సీఎం జగన్ చేసిన రచ్చ మామూల్ది కాదు. కానీ.. చివరకు ఏమైంది. అది ఏపీలో పెద్ద సమస్యగా మారింది. ఐదేళ్లు టీడీపీ పాలించి.. అమరావతి రాజధాని అన్నది. తర్వాత జగన్ వచ్చారు. అమరావతి ఒక్కటే ఎలా సరిపోద్ది… వైజాగ్, కర్నూలును కూడా అమరావతితో పాటు రాజధాని చేద్దాం. అప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. దానికి కొందరు మద్దతు ఇచ్చారు.. ఇంకొందరు అమరావతి ఒక్కటే రాజధాని.. మూడు రాజధానులు వద్దు అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల మెప్పు పొందడం కోసం.. వైజాగ్ ను కూడా రాజధానిని చేస్తున్నా అని ప్రకటించారు జగన్. దీంతో.. వైజాగ్ మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలంతా జేజేలు కొట్టారు జగన్ కు. వైజాగ్ కు రాజధాని తరలిపోవడం పక్కన పెడితే.. ఇప్పుడు వేరు సమస్య వచ్చి చేరింది జగన్ కు. అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్య.
అటు రాజధాని ఇంకా వైజాగ్ కు రాలేదు. ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనకు కాకుండా పోతోంది. ప్రైవేటు పరం కాబోతోంది. ఇంత జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా జగన్ ఏం చేస్తున్నారు. ఏం లేదు. ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్ మిగిలిపోతారు అనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందంటే.. ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ ను ఘోరంగా ఓడిస్తారు. అసలు.. జగన్ పొలిటికల్ కెరీర్ కే దీనివల్ల పెద్ద దెబ్బ పడే ప్రమాదం ఉంది. చూద్దాం మరి.. దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో?