YS Jagan Fired On Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడు.. పాత్రదారి, సూత్రదారి చంద్రబాబే.. జగన్ ఫైర్..!

NQ Staff - September 16, 2023 / 01:00 PM IST

YS Jagan Fired On Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడు.. పాత్రదారి, సూత్రదారి చంద్రబాబే.. జగన్ ఫైర్..!

YS Jagan Fired On Pawan Kalyan :

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ మొదటిసారి రియాక్ట్ అయ్యారు. ఆయన లండన్ కు వెళ్లిన తర్వాత చంద్రబాబు అరెస్ట్, పవన్ కల్యాణ్‌ హడావిడిగా జైలుకు వెళ్లి టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవడంపై నేడు జగన్ ఫైర్ అయ్యారు. నిడదవోలులో నిర్వహించిన కాపు పేదమహిళలకు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూటిగా పవన్, చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు జగన్. స్కిల్ స్కామ్ లో దొరికినా సరే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దొంగను అవినతి నుంచి కాపాడేందుకు గజదొంగలు అంతా ఒక్కటయ్యారు.

ఆరు ఎల్లో మీడియా సంస్థలు, రెండు ఎల్లో పత్రికలు కలిసి చంద్రబాబు అవినీతిని కవర్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారు. కానీ ఆయన్ను కాపాడేందుకు పలుకుబడి కలిగిన ఆయన మంద బలం ట్రై చేస్తోంది. అసలు పవన్ కల్యాన్‌ అవినీతి మీద ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని అంటాడు. కానీ చంద్రబాబు అవినీతి మీద ఎందుకు ప్రశ్నించట్లేదు అని జగన్ ప్రశ్నించారు. తన జీవిత కాలమంతా సామాజిక వర్గాలను వంచించి ప్రజలను దోచేసిన చంద్రబాబును శిక్షిస్తే తప్పేంటి అని సూటిగా అడిగారు జగన్.

కానీ చట్టం ఎవరికీ చుట్టం కాదు. అందుకే అరెస్ట్ చేశారు. కానీ గతంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఆడియో టేపు కేసులో దొరికినా సరే అప్పుడు బయట పడ్డారు. అప్పుడు ఫోన్ లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ రిపోర్టు ఇచ్చినా సరే శిక్ష పడలేదు. కానీ ఇప్పుడు పక్కాగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే ఆయన జైలులో ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా చంద్రబాబును కాపాడేందుకు కోట్లు తీసుకున్న లాయర్లు, ఎల్లో మీడియా సంస్థలు రెడీ అయ్యాయి. కానీ వారంతా చంద్రబాబు అవినీతి చేశాడని మాత్రం ఒప్పుకోవట్లేదు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us