జగన్ మైండ్ ని విపరీతంగా తొలిచేస్తున్న పాయింట్ ఇదే – తేడా వస్తే ఇంతే సంగతులు !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఓ సామాజిక వర్గ ప్రజల నిరసనలకు, విమర్శలకు దారి తీస్తున్నాయి. దేవాలయాల ఆస్తుల అమ్మకం విషయం పై జగన్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు బ్రేక్ పడుతోంది. దేవాలయాలను దాతలు విరాళంగా ఇచ్చిన భూములను టచ్ చేస్తే హిందువుల మనోభావాలు వెంటనే దెబ్బతింటాయి. ఈ సున్నితమైన అంశంలో సీఎం జగన్ ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ys jagan

కానీ ‘ఆలయ భూములను వేలం వేస్తున్నాం.. కౌలుకి ఇచ్చినా.. ఎక్కువగా ఆదాయం రావడం లేదు కాబట్టే అమ్మేస్తున్నాం. వచ్చిన డబ్బులకు లభించే వడ్డీలను కూడా దేవుళ్ళకే ఉపయోగిస్తాం’ అని చెప్పి ఈజీగా ఆలయ భూములను అమ్మేయడం అంత సులువైన పని కాదు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయం మఠానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని 208.51 ఎకరాల భూములను వేలం వేస్తున్నామని జగన్ సర్కార్ ప్రకటించడంతో హిందువులలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. దేవాలయాలకు దానం చేసిన భూములలో కౌలు రైతులు పంట పండించుకొని బతుకుతున్నారు కదా.. ఆ విధంగానైనా దేవాలయ భూములు మంచి పనికి ఉపయోగపడుతున్నాయి కదా.. ఇప్పుడు ఉన్నపళంగా భూములను అమ్మేస్తే వారి భవిష్యత్తు ఏమిటని సామాన్య ప్రజానీకం జగన్ సర్కార్ ని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి దేవాలయాల యొక్క ఆస్తులను విక్రయించాలన్న నిర్ణయం టీడీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడే తీసుకోవడం జరిగింది కానీ జగన్ ఇప్పుడు అమలు పరచడానికి సిద్ధం కావడంతో ఆయన్ని దోషిగా నిలబెడతారు. ప్రతిపక్ష పార్టీ అయిన జనసేన, బీజేపీ మరియు టీడీపీ కూడా జగన్ మతాన్ని ప్రస్తావిస్తూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీయ వద్దని గగ్గోలు పెడుతున్నారు. గతంలో కూడా ప్రతిపక్ష పార్టీలు మరియు ప్రజలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తుల విషయంలో ఇలాగే వ్యతిరేకత చూపగానే సీఎం జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తో టీటీడీ అధికారులు ఆస్తుల అమ్మకం విషయంపై ముందంజ వేయలేదు. రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన భూముల విక్రయం లో కూడా సీఎం జగన్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అందుకే రాఘవేంద్ర స్వామి మ‌ఠం ఏఏవో మాధ‌వ‌శెట్టి దేవాలయాల భూముల వేలం ప్రక్రియను వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Advertisement