YS Jagan : అంబులెన్స్‌కి దారి ఇచ్చిన జ‌గ‌న్‌.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్

YS Jagan : చావు బ‌తుకుల‌లో ఉన్న వారికి త‌మ వంతు సాయం చేయ‌డం మానవ నైజం. ఎంత పెద్ద పొజీష‌న్‌లో ఉన్న‌వారైన స‌రే అంబులెన్స్‌కి దారి వ‌దులుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. తాజ‌గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఎనికేపాడు వద్ద ఒక అంబులెన్స్ సీఎం కాన్వాయ్ వెనుక వస్తుంది. దీనిని గమనించిన జగన్ అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

YS Jagan convoy gives way to ambulance
YS Jagan convoy gives way to ambulance

తన కాన్వాయ్‌ని పక్కకు జరిపి నెమ్మదిగా వెళ్లాల్సిందిగా ఆదేశించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ జగన్ అంబులెన్స్‌లకు దారి ఇచ్చిన ఘటనలు వున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఓదార్పు యాత్ర, పాదయాత్ర సమయాల్లోనూ తన మీటింగ్‌లను ఆపి మరీ ఆయన అంబులెన్స్‌లను పంపించారు. సీఎం అయిన తర్వాత కూడా కాన్వాయ్‌ని ఆపిన ఘటనలు ఎన్నో వున్నాయి.

గతేడాది సెప్టెంబర్ 2న.. కడప జిల్లా పులివెందుల నుంచి తాడేపల్లి నివాసానికి వస్తున్న సమయంలో.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లికి బయల్దేరారు. అదే సమయంలో గూడవల్లి- నిడమానూరు మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఇది గమనించిన జగన్ అంబులెన్స్‌కి దారి ఇచ్చారు.

జ‌గన్ ఒక వైపు విమ‌ర్శ‌ల‌తో పాటు మ‌రోవైపు ప్ర‌శంస‌లు పొందుతున్నాడు. ప్ర‌స్తుతం ఏపీ భారీ వ‌ర్షాల‌తో అట్ట‌డుకుతున్న విష‌యం తెలిసిందే. ప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ఆయన ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు.