జగనన్నా .. ఎందుకిలా మారిపోయావ్ : గోల గోల చేస్తున్న వైసీపీ ఫ్యాన్స్ !

గత సంవత్సరం జరిగిన 2019 అసెంబ్లీ  ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గత  ప్రభుత్వం అయిన టీడీపీ పార్టీ నేతృత్వంలో  జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు తమ నాయకుడిగా జగన్ ను ఎంచుకున్నారు. ప్రజలు కూడా  ఆయనపై నమ్మకం ఉంచారు..ఎన్నడూ ఎరుగని రీతిలో 151 సీట్ల  భారీ మెజారిటీ తో వైసీపీ పార్టీ అధికారంలో వచ్చింది. అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలలోకి వెళ్లారు జగన్. అయితే అంతకముందు ఎన్నికల సమయంలోనూ టీడీపీ పార్టీ బాగా ప్రచారంలో ఉండడంతో  టీడీపీ పార్టీ ని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ టీడీపీ పార్టీ వచ్చిన అవకాశాన్ని సరిగ్గా  వినియోగించుకోకుండా  రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా మార్చారు. అదే సమయంలో ఎన్నో ఎత్తుగడలతో  జగన్  టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని  నియోజకవర్గాల్లో అభ్యర్థులను తయారు చేసి ఎంపిక చేసి గెలుపొందేలా చేశారు. కానీ తీరా గెలిచాక జగన్ నుంచి ఆ అభ్యర్థులను ఎంతో చాకిచక్యంతో, మాయమాటలు చెప్పి చంద్రబాబు తన పార్టీ లో చేర్చుకున్నారు.  గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన నిర్వాకానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఒకరా, ఇద్దరా ఏకంగా 23 మంది వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లు ఒక్కొక్కరిగా టీడీపీ కి వెళ్లి జగన్ కు నమ్మక ద్రోహం చేశారు.అయితే ఇలా నమ్మక ద్రోహం చేసిన వారిని ఇప్పటికీ జగన్  క్షమించడం  లేదంటే వారిపై జగన్ కు ఎంత కోపం ఉందొ మాటల్లో చెప్పనక్కర్లేదు అనుకుంట.

ys jagan

అయితే కాలం ఒకేలా ఉండదు అని నిరూపణ అయింది.  ఈ సారి  చంద్రబాబును ఓడించేలా చేసిందని చెప్పొచ్చు..ఇదేనేమో ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం అంటే.. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసిందే.. రాజధాని తరలింపు విషయంలో రాష్టం లో వాడి వేడి చర్చలు కూడా జరిగాయి. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న గాని జగన్ మాత్రం తాను  అనుకున్నది సాధించి తీరారు.. అయితే ఇన్ని చేస్తున్న జగన్ సీఎం  అయ్యాక అయన వ్యవహార శైలి మారిందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.  ప్రభుత్వంలో ఇప్పుడు అంతా జగనే  అన్నట్లు వ్యవహరిస్తున్నారట.అసలు  క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదుట. జగన్ వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి సరిగ్గా లేదని విపక్ష నేతలు విమర్శిస్తున్న గాని వాళ్ళకి తిరిగి  సమాధానం చెప్పే తీరిక కూడా జగన్ కు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారట. అయితే అసలు జగన్ మంత్రి వర్గ సమావేశాల సమయంలో తప్పా, మిగతా సమయంలో  సచివాలయానికి కూడా రావడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. అసలు నాయకుడు రాకపోతే కొసరు నాయకులు ఇంకా ఏమి వస్తామని  మంత్రులు కూడా కన్పించడం మానేశారు. ఇక అధికారుల సంగతి సరేసరి. వారిదే ఇష్టారాజ్యంగా మారిపోయింది. అందుకే వైసీపీ నేతలే జగన్ ను ఒకసారి ప్రశాంత్ కిషోర్ టీం చేత సర్వే చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.. !

Advertisement