ys jagan : కరక్ట్ గేమ్ ప్లాన్ మొదలెట్టిన వైఎస్ జగన్, నిమ్మగడ్డని ఎక్కడ టచ్ చెయ్యాలో అక్కడ చేశాడు?

CM YS Jagan action plan over SEC Nimmagadda ramesh kumar
CM YS Jagan action plan over SEC Nimmagadda ramesh kumar

ys jagan : ఏపీలో ఎన్నికల కమిషన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా సాగుతోంది. వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అసలు.. ఏం జరుగుతోంది. ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఏపీ సర్కారు మధ్య ఎందుకు వైరం పెరుగుతోందో అర్థం కావడం లేదు. కానీ.. ఏ యుద్ధానికైనా ఒక ముగింపు ఉంటుంది. కానీ.. వీళ్ల వైరం మాత్రం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది కానీ.. తగ్గడం లేదు.

ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో.. ఎన్నికలపై నిమ్మగడ్డ అస్సలు ఆగడం లేదు. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నాడు.

అయితే… సీఎస్ కు రాస్తే ఓకే కానీ.. ఏకంగా వైసీపీ నేతల మీద, ప్రభుత్వం మీద ఆరోపిస్తూ.. నిమ్మగడ్డ గవర్నర్ కు లేఖ రాయడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్ది రెడ్డిలపై గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. వీళ్లు ఎన్నికల విషయంలో హద్దు దాటుతున్నారంటూ గవర్నర్ కు ఫిర్యాడు చేయడం.. మాపై అనవసరపు ఆరోపణలు చేయడం ఏంటని.. నిమ్మగడ్డపై ఏపీ స్పీకర్ కు మంత్రులు ఫిర్యాదు చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

వెంటనే ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారాం.. మంత్రుల ఫిర్యాదును సిఫార్సు చేయడంతో.. ప్రస్తుతం నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటీ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా నిమ్మగడ్డను ఎక్కడికక్కడ నిలువరించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య  కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని.. ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.

ఆల్ ఇండియా సర్వీస్ అధికారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేదంటూ.. ఆ ఉత్తర్వులను తిరస్కరించింది. దీనిపై ఏపీ సీఎస్.. ఆదిత్యనాథ్ దాస్.. ఏపీ సీఈసీ నిమ్మగడ్డకు లేఖ రాశారు. దీంతో నిమ్మగడ్డకు మరో షాక్ తగిలింది. ప్రవీణ్ ప్రకాశ్ మీద చేసిన ఆరోపణలన్నీ నిరాధారమంటూ ఏపీ సీఎస్ లేఖలో స్పష్టం చేశారు. దీంతో నిమ్మగడ్డకు మరో తలనొప్పి స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement