వాళ్ళిద్దరి మీద ఉగ్రరూపంతో ఉన్న వైఎస్ జగన్ – ఇది భయంకరమైన బ్రేకింగ్ !

నాలుగు రోజుల క్రితం నిర్వహించిన తూర్పుగోదావరి డీఆర్‌సీ సమావేశం లో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు వెంటనే సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఈ సమావేశంలో మాజీ డీప్యూటీ సీఎం, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరుగుతున్నట్టు తనకు తెలిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల విషయంలో ఎవరు అవినీతి చేశారో.. డబ్బులు ఎవరు వసూలు చేశారో పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పాలని.. ద్వారంపూడి డిమాండ్ చేశారు.

pilli vs dvarampudi

ఇదే సమావేశంలో మెడలైన్ వంతెన నిర్మాణం గురించి కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రస్తావించారు. మెడలైన్ వంతెన నిర్మాణం చేపడితే కాకినాడ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని.. అందుకే దాని నిర్మాణాన్ని వెంటనే స్టాప్ చేయాలని ఆయన అన్నారు. పెళ్లి సుభాష్ చంద్ర బోస్ చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా ద్వారంపూడి తీవ్ర విముఖత చూపారు. పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై బాహాటంగానే ద్వారంపూడి వ్యతిరేకత చూపడంతో సమావేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గకుండా తీవ్ర వాగ్వాదం లో చేసేసరికి జిల్లా కలెక్టర్ డీఆర్సీ సమావేశాన్ని వాయిదా వేశారు. ఐతే డీఆర్సీ సమావేశంలో సుభాష్ బోస్, ద్వారంపూడి మధ్య జరిగిన వివాదం జగన్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆ ఇద్దరు నేతలను తన వద్దకు పిలుచుకొని సీఎం జగన్ బాగా సీరియస్ అయ్యారు. ఇరువురి నేతలతో భేటీ పెట్టి మరీ వారికి క్లాస్ తీసుకున్నారు.

జగన్ సీరియస్

ఐతే డీఆర్సీ మీటింగ్ లో ద్వారంపూడి గట్టిగా అరవడంతో ఆయనపై జగన్ బాగా సీరియస్ అయ్యారట. ఇరువురి నేతల మధ్య గొడవలు సద్దుమణిగేలా జగన్ క్లాస్ తీసుకున్నారు. అధికార పార్టీ అయిన వైసీపీలో ఆధిపత్య పోరులు బాగా నడుస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నేతలే ప్రత్యర్థులుగా వ్యవహరిస్తూ తీవ్ర వాగ్వాదాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ ఆధిపత్యపోరు వలన సీఎం జగన్ నలిగిపోతున్నారు. సొంత పార్టీ నేతలే గొడవ పెట్టుకుంటే వైసీపీ కి చెడ్డపేరు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అందుకే వైసీపీ నేతల మధ్య శత్రుత్వాన్ని తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ద్వారంపూడి, సుభాష్ చంద్రబోస్ లపై ఉగ్రరూపం చూపించారని వినవచ్చింది.

Advertisement