40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏపీ ప్రజల నాశనం కోరుకుంటున్నాడని, సంక్షేమ పథకం మొదలు పెట్టాలంటే చాలు అయన కాలు పెట్టడానికి సిద్దమయిపోతున్నాడని ముఖ్యమంత్రి వైస్ జగన్ ఈ రోజు అసెంబ్లీ లో ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కుట్రపూరితంగా ప్రజలకు కోసం ఎలాంటి పని చేయనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటుంది అన్నారు వైస్ జగన్.
ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో..
పేద ప్రజల బాగు కోసం వైస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలనుకుంటే, లేని పోనీ విషయాలతో కోర్టుకు వెళ్లి ఆ పని జరగనివ్వడం లేదు అని వాపోయారు. ఒంగోలు లో టీడీపీ నేత దామచర్ల జనార్థన్ తో, కాకినాడలో మరో నేత కొండబాబు తో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా దగ్గరుండి కోర్టుల్లో పిటీషన్లు వేయించారన్నారు. ఇక అనుకూల మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయించడం, ప్రసారం చేయించడం వల్ల చంద్ర బాబు ఎలాంటి ప్రయోజనం పొందారని వైస్ జగన్ గుర్తుచేసారు.
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన ఖర్మ
అస్సలు ఈ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన ఖర్మ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ అధ్యక్షుల వారికి, కమ్యునిస్టులకు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశాఖపట్నంలో సీపీఐ నేత లోకనాధం పట్టాల పంపిణి ని ఆపేందుకు మరొక పిటీషన్ దాఖలు చేశారన్నారు జగన్. చంద్ర బాబు వేయిస్తున్న కేసులకు స్టేలు తెచ్చుకోవడాన్నికి టైం సరిపోతుందని, బాబులాగ మిగతా పార్టీలని మేము మ్యానేజ్ చేయలేకపోతున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు తప్ప చంద్రబాబు కి మరొక ఎజెండా లేదంటూ అయినప్పటికీ బాబుకి ప్రజలే బుద్ది చెప్తారంటూ, అన్ని సమస్యలను అధిగమించి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని వైస్ జగన్ చెప్పారు.