YS Jagan : బీఆర్ఎస్ గుణపాఠం.. జగన్ భారీ ప్రక్షాళన చేయబోతున్నారా..?

NQ Staff - December 7, 2023 / 12:33 PM IST

YS Jagan : బీఆర్ఎస్ గుణపాఠం.. జగన్ భారీ ప్రక్షాళన చేయబోతున్నారా..?

YS Jagan :

బీఆర్ ఎస్ తెలంగాణలో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడమే బీఆర్ ఎస్ కొంప ముంచిందని అంటున్నారు. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా సరే కేసీఆర్ టికెట్లు ఇవ్వడం వల్లే ఓడిపోయిందని చాలా సర్వేలు చెబుతున్నాయి. దీన్ని జగన్ ఓ గుణపాఠంగా తీసుకుంటున్నారంట. తెలంగాణలో బీఆర్ ఎస్ చేసిన తప్పు తాను చేయొద్దనే ఉద్దేశంతో ఇప్పటికే అలెర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి జగన్ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం చేస్తున్నారు.

కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే జగన్ కు వీటిని నివేదించినట్టు తెలుస్తోంది. దాంతో జగన్ అప్రమత్తం అవుతున్నారంట. పరిస్థితి ఇలాగే కొనసాగితే తనకు బీఆర్ ఎస్ కు తగిలిన విధంగా దెబ్బ పడటం ఖాయమని భావిస్తున్నారు. అందుకే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. తప్పులను సరిదిద్దుకోవాలంటూ చెబుతున్నారంట. ఒకవేళ సరిదిద్దుకోలేకపోతే మాత్రం కచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తామని జగన్ ఇప్పటికే వారికి తేల్చి చెబుతున్నారు.

ప్రత్యామ్నాయంగా వారి స్థానంలో కొత్త వారిపై కూడా ఆరాలు తీస్తున్నారంట జగన్. ఇక సరిదిద్దుకోలేనంత తప్పులు చేసిన ఎమ్మెల్యేలకు మాత్రం పిలిపించుకుని టికెట్లు ఇవ్వడం కుదరదని డైరెక్టు గానే చెప్పేస్తున్నారంట. ఎమ్మెల్యే టికెట్లకు బదులు నామినేటెడ్ పదవులు ఇస్తామని చెబుతున్నారు జగన్. రాబోయే నాలుగు నెలల వరకు ప్రతి నెలకు ఒకసారి సర్వేలు చేయించుకుని అందరి మీద నజర్ వేయబోతున్నారంట జగన్. ఇందుకోసం అందరికీ ఇప్పటికే అలెర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా విషయాల్లో ప్రతి సర్వే ఫలితాలను జగన్ విశ్లేషిస్తూనే ఉన్నారు.

కాబట్టి జగన్ ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగానే ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. లేకపోతే కచ్చితంగా టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారంట. ఇదే విషయంలో చంద్రబాబు మాత్రం సైలెంట్ గానే ఉండిపోతున్నారంట. ఎందుకంటే ఏ మాత్రం నేరుగా వార్నింగ్ ఇచ్చినా సరే టీడీపీని వీడేందుకు రెడీ అవుతున్నారంట.

YS Jagan Analyzing Results Of Each Survey

YS Jagan Analyzing Results Of Each Survey

కానీ జగన్ ఇలా కాదు. ఏ విషయంలో అయినా సరే ముక్కు సూటిగానే చెప్పేస్తున్నారు. దాంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం చేసేది లేక సైలెంట్ గానే ఉండిపోతున్నారు. ఈ విషయంలో వైసీపీ లీడర్లు కూడా జగన్ మెప్పు పొందేందుకు రెడీ అవుతున్నారు. చూడాలి మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us