టిక్ టాక్ లాంటి యాప్ ను ప్రవేశపెట్టిన యూట్యూబ్

Advertisement

భద్రతా కారణాల దృశ్య ఇండియాలో టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పుడు అమెరికాలో కూడా టిక్ టాక్ బ్యాన్ దిశగా పయనిస్తోంది. అయితే యూత్ టిక్ టాక్ యాప్ కు బాగా కనెక్ట్ అయ్యారు. కాబట్టి టిక్ టాక్ లాంటి యాప్ ను తయారు చేయడానికి భారతీయ సంస్థలు, ఇతర దేశాల సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే చింగారి, ఇంస్టాగ్రామ్ రీల్స్, లాంటి ఇప్పటికే వచ్చాయి. అయితే ఇప్పుడు యూట్యూబ్ కూడా టిక్ టాక్ లాంటి వీడియో షేరింగ్ యాప్ ను డెవలప్ చేసింది.

యూట్యూబ్ లోనే షాట్స్ అనే పేరుతో ఆప్షన్ కనిపించనుంది. ఈ యాప్ ప్రస్థుతానికి ఆండ్రాయిడ్ యుసర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఐఓఎస్ కు కూడా అందుబాటులోకి తెస్తామని యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 15 సెకన్ల నిడివిలో లఘు చిత్రాలు, ఆకర్షణీయమైన వీడియోలను చిత్రీకరించే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. త్వరలోనే మరిన్ని ఫీచర్లు జోడించి ఇతర దేశాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. ఈ యాప్ లో స్పీడ్ కంట్రోల్స్, హ్యాండ్స్-ఫ్రీ రికార్డ్ టైమర్, కౌంట్‌డౌన్ ఫీచర్లు కూడా ఉన్నాయన్నారు. ప్రస్థుతానికి బీటా యూట్యూబ్ యూజర్లుకు మాత్రమే అందుబాటులో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here