డైరెక్టర్ గా యువ హీరో

Advertisement

టాలీవుడ్ లో యువ హీరోలు తమ నటనతోనే కాకుండా డైరెక్టర్ గా కూడా తమ సత్తా ఏంటో చూపిస్తా అంటున్నారు. అయితే హీరో నిఖిల్ సిద్దార్థ ఇప్పటికే విభిన్నమైన కథలను ఎంచుకొని విజయాలను సాధిస్తూ ఉంటాడు. ఇప్పటికే ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, అర్జున్ సురవరం లాంటి సినిమాలు నిఖిల్ కు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటె త్వరలో డైరెక్టర్ గా మారనున్నాడు ఈ యువ హీరో.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నిఖిల్. హీరో అవ్వకముందు హైదరాబాద్ నవాబ్స్సినిమాకు లక్ష్మీ కాంత్ చెన్న వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఇక డైరెక్షన్ మీద పట్టు ఉండడంతో దర్శకుడిగా మారాలని నిఖిల్ చెప్పుకొచ్చాడు. త్వరలో ఒక ప్రయోగాత్మక పిల్లలతో ఓ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా మారనున్నట్లు హీరో నిఖిల్ వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here