పేటీఎం కొత్త ఫీచర్.. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లింపు.. ఇలా చేస్తే చాలు
Ajay G - December 5, 2020 / 10:25 AM IST

మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఇంటి అద్దె చెల్లించే సమయానికి మీదగ్గర డబ్బులు ఉండటం లేదా? మీలాంటోళ్ల కోసమే పేటీఎం సరికొత్త సర్వీసును తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే సరికొత్త ఫీచర్ అది.

you can pay room rent also from paytm by using credit card
సాధారణంగా క్రెడిట్ కార్డుతో షాపింగ్ గట్రా చేస్తుంటారు కానీ.. ఇలా ఇంటి అద్దె చెల్లించడం అనే కాన్సెప్ట్ ఎప్పుడూ వినలేదు అంటారా? అవును.. పేటీఎం తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ఇది.
రూమ్ రెంట్ కట్టాలంటే క్రెడిట్ కార్డు ఉంటే సరిపోదు. ఎందుకంటే.. డైరెక్ట్ గా ఓనర్ కు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించే అవకాశం ఉండదు. కాకపోతే… ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కొన్ని బ్రోకరేజ్ యాప్స్ ద్వారా కట్టొచ్చు. కాకపోతే.. ఆ యాప్స్ ద్వారా ఓనల్ కు రెంట్ చెల్లించాలంటే.. ఓనర్ కూడా ఆయా యాప్స్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
అయితే.. చాలామంది ఓనర్స్ ఆయా యాప్స్ లో రిజిస్టర్ అవ్వరు. అటువంటి వాళ్ల కోసమే పేటీఎం కొత్తగా ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. పేటీఎంను ఉపయోగించి.. క్రెడిట్ కార్డు ద్వారా డైరెక్ట్ గా ఓనర్ బ్యాంకు అకౌంట్ కు డబ్బులు పంపించవచ్చు. కాకపోతే ఎక్స్ ట్రా 2 శాతం చార్జీలు పే చేయాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డు ఉపయోగించి రూమ్ రెంట్ కడితే.. క్యాష్ బ్యాక్ తో పాటు రివార్డు పాయింట్స్ కూడా లభిస్తాయి. ఆల్ సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి ముందుగా వెళ్లాలి. అక్కడ మంత్లీ బిల్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ రెంట్ పేమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేసి రూమ్ రెంట్ ఎవరికి పంపించాలనుకుంటున్నారో వాళ్ల అకౌంట్ డిటెయిల్స్ ఇచ్చి పంపించవచ్చు.