Yellow Media Targeted Jr NTR : తారక్ ను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా.. భగ్గుమంటున్న టాలీవుడ్..!
NQ Staff - September 17, 2023 / 01:48 PM IST

Yellow Media Targeted Jr NTR :
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఉంది ఇప్పుడు ఏపీలో పరిస్థితి. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ను తిడుతున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబును అవినీతి కేసులో తారక్ ఏమైనా ఇరికించాడా.. లేదంటే స్కామ్ చేయమని సలహాలు ఇచ్చాడా.. లేదు కదా. మరి అలాంటిది తారక్ ను ఎందుకు తిడుతున్నారు. స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాలు సరిగ్గా ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్ విధించింది. చట్టం ఎవరికీ చుట్టం కాదు సాక్ష్యాలు ఉంటేనే శిక్షలు విధిస్తారని అందరికీ తెలుసు.
చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే ఎన్టీఆర్ స్పందించట్లేదు. తన తాతకు తాను సరైన వారసుడిని అని ఆయన నిరూపించుకుంటున్నాడు. కానీ నందూమరి ఫ్యామిలీలో ఇతరులు మాత్రం చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటు నారా అటు నందమూరి కుటంబ సభ్యులు చంద్రబాబుకు మద్దతు ప్రకటించడంతో ఎల్లో మీడియా రెచ్చిపోతోంది. తారక్ ను కార్నర్ చేస్తూ తిట్టిపోస్తోంది. నీ పేరు మార్చుకో అంటూ ఏకంగా తారక్ మీద ఓ ప్రముఖ ఎల్లో ఛానెల్ పెద్ద స్టోరీ చేసేసింది. దీంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఫైర్ అవుతున్నారు.
అసలు చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే తారక్ ఎందుకు స్పందించాలి. అంటే ఇప్పుడు అంటుకున్న బురదను తారక్ కూడా అంటించుకోవాలా అంటూ కడిగి పారేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ను ఇదే నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఎంతలా అవమానించారో మర్చిపోయారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ను రాజకీయంగా వాడుకుని కరివేపాకులా తీసి పడేశారు. ఇన్ని అవమానాలు, అవసరానికి వాడుకుని పక్కన పెట్టేయడాలు చేస్తున్నా సరే ఇన్ని రోజులు ఎన్టీఆర్ సహనంగా భరించాడు. ఎవరినీ ఏమీ అనకుండానే తనంతట తాను సినిమాలు చేసుకుంటున్నాడు.
ఎవరు ఏ కార్యక్రమానికి పిలవకపోయినా ఓర్పుగా చూస్తున్నాడు. అలాంటి తారక్ ను ఇప్పుడు మళ్లీ మధ్యలోకి లాగడం ఎందుకు అని కౌంటర్లు వేస్తున్నారు తారక్ అభిమానులు. అంటే చంద్రబాబుకు అసవరం ఉంటేనే మీకు తారక్ గుర్తుకు వస్తాడు. మరి మిగతా సమయాల్లో ఎందుకు గుర్తుకు రావట్లేదని అడుగుతున్నారు. ఎంతసేపు తారక్ ను బ్లేమ్ చేయడానికే పూనుకున్నారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ఎల్లో మీడియా మీద.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఏ ఒక్క ప్రోగ్రామ్ కు కూడా తారక్ ను పిలవకపోయినా అప్పుడు ఎల్లో మీడియా స్పందించలేదు. కానీ ఇప్పుడు బాబు అరెస్ట్ అయ్యేసరికి మాత్రం తారక్ మీద పడి ఏడుస్తోందని అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఇప్పటికే చాలామంది
సెలబ్రిటీలు తారక్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాగే వార్తలు రాస్తే పరిణామాలు సీరియస్ గా ఉంటాయని చెబుతున్నారు.