Chandrababu : చంద్రబాబు కి అతి పెద్ద షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయిన వైసీపీ..!

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ రంగంలో ఎంతో కాలం నుంచి కొనసాగుతున్నారు. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించే ఏపీ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఏడుపదుల వయసులో కూడా రాజకీయాల్లోకి క్రియాశీలకంగా ఉంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. 151 మంది ఎమ్మెల్యేలకు తానొక్కరే సమాధానాలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

YCP Will Give Big Shock to Chandrababu Soon చంద్రబాబు
YCP Will Give Big Shock to Chandrababu Soon

అయితే ఈ ఎన్నికల్లో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వాటిని ఆపేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు పూర్తి కాగా.. నాలుగో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐతే నాలుగో దశలో చంద్రగిరి నియోజక వర్గంలోని నారావారిపల్లెలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నారావారిపల్లె చంద్రబాబు నాయుడి జన్మస్థలం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నారావారిపల్లి అంటే చంద్రబాబు నాయుడికి మహా ఇష్టం. ప్రతి సంక్రాంతికి తన సొంత గ్రామానికి వెళ్లి ఆయన సంబరాలు జరుపుకుంటారు.

ఐతే చంద్రబాబు నాయుడు ని ఎప్పుడూ ఆదరించే కుప్పం నియోజకవర్గం ప్రజలు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అవమానకర అపజయాన్ని కట్టబెట్టారు. దీంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ సంతోషంతోనే ప్రస్తుతం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నారావారిపల్లెలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి వైసీపీ తరుపున ఎస్సీ మహిళ పోటీ చేస్తున్నారు. ఈ గ్రామంలో దళితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో వైసీపీ ప్లాన్ ప్రకారమే ఎస్సి అభ్యర్థి ని రంగంలోకి దింపిందని తెలుస్తోంది. సొంత ఊరులో ఎలాగైనా చంద్రబాబు కి భారీ షాక్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. మరి నారావారిపల్లె ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.

Advertisement