హీరో రామ్ పై ఫైర్ అయిన వైసీపీ ఎంపీ

Advertisement

విజయవాడ రమేష్ హాస్పిటల్ మేనేజిమెంట్ కోవిడ్ హాస్పిటల్ గా నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హాస్పిటల్ వ్యవహారంలో హీరో రామ్ పోతినేని స్పందించాడు. అయితే తాజాగా రామ్ పై వైసీపీ ఎంపీ వల్లభనేని వంశీ ఫైర్ అయ్యాడు. రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని విమర్శించాడు. అలాగే రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా.. వేరే వాళ్లు ఎవరు చూడరా అని ప్రశ్నించారు.

ఇతర కులాలకు చెందిన వారిని తన సినిమాలు చూడొద్దని రామ్ చెప్పాలని అన్నాడు. కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని వెల్లడించాడు. అయితే ఏపీ లో ఉన్న చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి సంక్షేమ పథకాలు ఆపిందా అని ప్రశ్నించాడు. అలాగే చంద్రబాబు ఒక్కడే తమ సామాజిక వర్గానికి నాయకుడు కాదని, అప్పట్లో చాలా మంది నాయకులు తమ సామాజిక వర్గం కోసం పని చేశారని పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here