వైసీపీ ఎంపీ రఘురామ రాజుకు ‘వై కేటగిరీ’ భద్రత

Advertisement

అమరావతి: నరసాపురం వైసీపీ ఎంపీ రఘు రామ రాజుకు ‘వై కేటగిరీ’ భద్రతను కలిపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తనను బెదిరిస్తున్నారని, వారి నుండి తనకు ప్రాణ హాని ఉందని ఢిల్లీ హై కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఉన్న ప్రాణహానిని గుర్తించి అధికారులు వై కేటగిరీ భద్రత కలిపించారని రఘురామ రాజు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు తనకు వై కేటగిరీ భద్రతకు సంబంధించిన పత్రాలు అందుతాయని వెల్లడించారు.

ఈ ప్రాసెస్ అంత పూర్తి అవ్వడానికి పది రోజుల సమయం పడుతుందని, ఆగస్ట్ 15 నాటికి భద్రత వస్తుందని రామరాజు తెలిపారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా తమ ప్రవర్తనను మార్చుకోవాలని, ప్రజా ప్రతినిధిని గౌరవించాలని రామరాజు కోరారు. ఎంపీ రఘు రామరాజు, వైసీపీ నాయకుల మధ్య గత కొన్ని నెలలుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెబల్ గా మారిన రామరాజుపై రానున్న రోజుల్లో వైసీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here