RK(ఆర్కే) : వేమూరి రాధాకృష్ణ రాజకీయాలపై రాసే వ్యాసాలు బాగా ప్రజాదరణ పొందుతూ ఉంటాయి. ఆయన రాసే ఆర్టికల్స్ ఎవరి ఊహకు కూడా అందవు అంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఆయన మున్సిపల్ ఎన్నికల పై ఒక సుదీర్ఘమైన వ్యాసం రాశారు. అయితే ఈ వ్యాసంలో చాలా లాజిక్కులు మిస్ అయ్యాయి. దీంతో మిగతా రాజకీయ విశ్లేషకులు.. ‘ఆర్కే ఈ జన్మకి మారడు. ఆ రాతలు ఏంటో ఆయన ఏంటో’ అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆయన రాసిన లాజిక్ లెస్ రాతలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, విశాఖ జిల్లాల మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేవలం ఈ మూడు మున్సిపల్ ఎన్నికలే రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయి అంటూ రాధాకృష్ణ చాలా కన్విన్సింగ్ పద్ధతిలో ఆర్కే పలుకు అంటూ ఒక వ్యాసం రాశారు. ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపిస్తే విజయవాడ, గుంటూరు ప్రజలు అమరావతి నుంచి రాజధాని ని తరలించడానికి మద్దతు తెలుపుతున్నట్టే అవుతుందని ఆయన అన్నారు. విశాఖ జిల్లా ప్రజలు వైసీపీ ని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సపోర్టు చేసినట్లే అవుతుందని ఆయన అన్నారు. ఒకవేళ వైసీపీ పార్టీ ఘోరంగా ఓడితే జగన్ తన నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటుందని.. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని.. అందుకే ప్రజలు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ పార్టీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచింది కానీ నిజానికి ఈ గెలుపును పార్టీ పరమైన గెలుపుగా ఎవరూ పరిగణించరు. కానీ మున్సిపల్ ఎన్నికల గెలుపు మాత్రం పార్టీలకే చెందుతుంది. అందుకే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి ఎండీ. రాధాకృష్ణ వైసీపీకి వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూ పార్టీని ఓడించాలని చెబుతున్నారు. ఒకవేళ రాధాకృష్ణ చెప్పినట్టు విజయవాడ, గుంటూరు ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే.. వారు తమ ప్రాంతాలకు రాజధాని వద్దనట్లే అవుతుంది. దీంతో అసలుకే ఎసరు వస్తుంది. కానీ ఈ లాజిక్ ని మిస్సయిన ఆర్కే వైసీపీకి ఎట్టిపరిస్థితిలోనూ ఓటు వేయకూడదని చెబుతున్నారు.