సీఎం జగన్ కు గుడి కట్టనున్న వైసీపీ నాయకులు
Admin - August 6, 2020 / 12:28 PM IST

అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టుదలతో ప్రయత్నించి, చివరికి గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రాజంపాలెంలో వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుడి కట్టనున్నారు. ఈ గుడికి సంబంధించిన భూమి పూజను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ నిర్వహించారు.
మన దేశంలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఖుష్భూ, ఇలియానా, నయనతార లాంటి వారికి కూడా అభిమానులు గుళ్ళు కట్టారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు, ప్రధాని మోదీకి కూడా గుళ్ళు కట్టారు. ఇప్పుడు జగన్ కు గుడి కట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. అయితే జగన్ గుడి కట్టడం పై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుళ్ళు దేవుళ్ళకు ఉండాలని, జగన్ కు గుడి కట్టి హిందూ మత సిద్ధాంతాలను అవమానపరచవద్దని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.