CM Jagan: జగన్ ని గాలికొదిలేసి ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్న ఆ నేతలు ..?
Mamatha 600 - February 5, 2021 / 06:08 PM IST

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బలమైన నేతగా కొనసాగుతున్నప్పటికీ సొంత జిల్లాలో మాత్రం కొన్ని సమస్యలను పరిష్కరించ లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలకు మరియు కార్యకర్తల మధ్య సంబంధాలు కాలక్రమేనా పూర్తిగా తెగిపోతున్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఎమ్మెల్యేలు పార్టీ విషయాలను పట్టించుకోకుండా పక్కనే ఉన్న బెంగళూరు కి వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాల్లో పరిస్థితి ఇలానే నెలకొందని టాక్ నడుస్తోంది.

Ycp leaders are busy with their own businesses
అయితే కొందరు వైసీపీ కార్యకర్తలు ఈ విషయంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు కలవాలని అనుకుంటున్నారు కానీ అది సాధ్యపడటం లేదట. దీంతో ఏం చేయాలో తెలియక కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నియోజకవర్గ ఇన్చార్జి ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉందట. కడప జిల్లాలోని కీలక వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పట్టించుకోకుండా బెంగళూరు నగరంలోని తమ వ్యాపారాల వ్యవహారాల్లో నిమగ్నమయ్యారని.. దీనివల్ల పార్టీ కి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుండడం తో ఎన్నికల ప్రచారానికి కొందరు పార్టీ కార్యకర్తలు కూడా ముందుకు రావడం లేదట. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి వైసీపీ కార్యకర్తలు అంతా కలిసి సీఎం జగన్ కి ఓ లేఖ రాసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి జగన్ కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఎప్పుడు? ఎలాగా ? తన సొంత కడప జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలను మందలించి.. వైసీపీ కార్యకర్తల సమస్యలకు జగన్ చెక్ పెడతారో చూడాలి. ఏది ఏమైనా సొంత పార్టీ నేతలతోనే జగన్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముందస్తుగానే జగన్ తన పార్టీ నేతలను తన దారి లోకి తెచ్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.