Varahi Vehicle : ‘వారాహి’ ఎన్ని ఓట్లు జనసేనకు తెచ్చిపెడుతుంది.?

NQ Staff - December 13, 2022 / 02:28 PM IST

Varahi Vehicle : ‘వారాహి’ ఎన్ని ఓట్లు జనసేనకు తెచ్చిపెడుతుంది.?

Varahi Vehicle : అది జస్ట్ ఓ వాహనం మాత్రమే. సినీ ప్రముఖుడు కదా.. పవన్ కళ్యాణ్ తన కోసం తయారు చేయించుకున్న వాహనానికి అభిమానుల నుంచి ఆ మాత్రం హైప్ వుండడం సహజమే. కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, ఆయన రాజకీయ ప్రముఖుడు కూడా. ఓ పార్టీ అధినేత.

జనసేనాని ప్రచార రధం ‘వారాహి’కి తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆ వాహనం ఎలా తిరుగుతుందో నేనూ చూస్తా..’ అంటున్నారో మంత్రి. ఇదెక్కడి వింత వాదన.? బొత్తిగా మతి లేకుండా మాట్లాడుతున్నారాయె.

‘వారాహి’ వివాదం ఎవరికి ప్రయోజనం.?

‘వారాహి’ అనే వాహనం వల్ల జనసేన పార్టీకి అదనంగా వచ్చే ఓట్లేమీ వుండవు. కానీ, ఆ ‘వారాహి’కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోంది వైసీపీ. తద్వారా గ్రామ స్థాయిలోకి వెళ్ళి జనసేన పార్టీ శ్రేణులు తమ పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన అవసరమే లేకుండా పోయింది.

‘వారాహి’ అంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జనసేనాని రాజకీయ ప్రచార రధం.. అని అందరికీ తెలిసిపోయింది. ఆ కోణంలో చూస్తే, వాహనం కోసం జనసేనాని చేసిన ఖర్చు.. ఈ ఫ్రీ పబ్లిసిటీ ద్వారా వెనక్కి వచ్చేసినట్లేనని అనుకోవాలేమో. అంత స్థాయిలో ఫ్రీ పబ్లిసిటీ జనసేనకు వైసీపీ ఇచ్చింది.
జనసేన ప్రచారకర్తలుగా వైసీపీ మంత్రులు పనిచేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us