Yashika Aannand : నిషా కళ్లతో యాషికా ఆనంద్ గ్లామర్ బుస బుస.!

NQ Staff - November 5, 2022 / 10:19 PM IST

Yashika Aannand : నిషా కళ్లతో యాషికా ఆనంద్ గ్లామర్ బుస బుస.!

Yashika Aannand : అందాల భామ యాషికా ఆనంద్‌కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఓ వైపు సినిమాలూ, మరోవైపు టీవీ షోలతో ఈ అమ్మడు ఎప్పుడూ బిజీ బిజీగా గడుపుతుంటుంది.

ఇన్‌స్టా మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అందాల భామ తమిళ సినిమాల్లోనే తన అంద చందాలకు పదును పెట్టింది. తెలుగులో ‘నోటా’ సినిమాలో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్ మూవీగా రూపొందిన సంగతి తెలిసిందే. అయితే, రౌడీ కెరీర్‌లో ఓ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది ‘నోటా’.

మత్తెక్కించే చూపుల్తో గ్లామర్ విషం చిమ్ముతోన్న యాషికా..

కానీ, ఈ సినిమాలో యాషికా ఆనంద్ క్యారెక్టర్ మాత్రం చాలా స్టైలిష్‌గా అందంగా తీర్చిదిద్దారు మేకర్లు. కాగా, ప్రస్తుతం నాలుగైదు తమిళ సినిమాలతో బిజీగా వుంది యాషికా ఆనంద్.

Yashika Aannand latest Cute Photos

Yashika Aannand latest Cute Photos

 

ఛాన్స్ వస్తే, తెలుగు సినిమాల్లోనూ నటించేందుకు రెడీనే అంటోంది యాషికా ఆనంద్. తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం కొన్ని ఘాటు మసాలా పిక్స్ పోస్ట్ చేసింది తాజాగా యాషికా ఆనంద్.
ఘాటు మామూలుగా లేదు. వాసన గుమాయించి కొడుతోంది.

ఆ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోస్తోంది యాషికా ఆనంద్ ఈ పిక్స్‌లో. ఒక్క మాటలో చెప్పాలంటే, బుసలు కొడుతున్న నాగినిలా కనిపిస్తోంది. మేకప్ గీకప్ చూస్తుంటే, ఇదేదో నాగ కన్య గెటప్‌లానే వుంది. చెవులకు నాగిని కమ్మలు, కట్టూ, బొట్టూ అంతా అలాగే అనిపిస్తోంది.

Yashika Aannand latest Cute Photos

Yashika Aannand latest Cute Photos

దేని కోసం అయితేనేమి.! ఈ పిక్స్‌లో యాషికా ఆనంద్ చేస్తున్న స్కిన్ షోకి మత్తులో తూగుతున్నారు నెటిజనం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us