Yash : కేజీఎఫ్ 2 సినిమాకి యష్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Yash (యష్ ):  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్. 1 సినిమా భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ కన్నడ సినిమా శాండల్ వుడ్ ఇండస్ట్రీ స్థాయి ని ఎక్కడికో తీసుకెళ్ళింది. రూ. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కేజిఎఫ్ 1 సినిమా రూ. 250 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 ఈ ఏడాదిలోనే జులై 16వ తేదీన విడుదలకై రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా పై భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

yash-remuneration-for-kgf-2-movie యష్
Yash Remuneration For KGF-2 Movie

నిజం చెప్పాలంటే బాహుబలి 2 సినిమా కంటే కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా పైనే ఎక్కువగా అంచనాలున్నాయి. రాఖీబాయ్ గా యష్ కనబరిచే డాషింగ్ యాక్టింగ్ ని చూసేందుకు కోట్ల మంది ప్రేక్షకులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ రాసుకున్న హీరో పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేయడంలో యష్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. అయితే కేజిఎఫ్ 1, కేజిఎఫ్ 2 సినిమా చేయడానికి సుమారు నాలుగు ఏళ్ళు పట్టింది. మరి నాలుగేళ్లు కేవలం ఈ యొక్క సినిమా కోసమే కష్టపడిన యష్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? అనడిగితే.. అక్షరాలా 30 కోట్ల రూపాయలు ఇచ్చారు అని సమాధానం వస్తోంది.

మన తెలుగు ఇండస్ట్రీలో రూ. 30 కోట్లు ఉంటే తక్కువే కానీ కన్నడ చిత్ర పరిశ్రమలో 30 కోట్లు అంటే మామూలు విషయం కాదు. నిజానికి కన్నడ పరిశ్రమలో మహా అంటే పది కోట్లు బడ్జెట్ తోనే సినిమాలు రూపొందుతాయి. పది కోట్ల కంటే సినిమాల బడ్జెట్ పెరిగిన దాఖలాల్లేవు. కానీ ప్రశాంత్ నీల్ వల్ల కేజిఎఫ్ సినిమా తర్వాత కన్నడ ఇండస్ట్రీ రేంజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది. ఇకపోతే సినిమాల లాభాల్లో కూడా వాటా ఇస్తామని యష్ కి నిర్మాతలు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బంగారు గనులు నేపథ్యంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా యష్ కి బంగారు గని అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement