Cricketer Yash Paul: క్రికెట్‌లో డ‌క్ ఔట్ కాకుండా ఉన్న ఏకైక క్రికెట‌ర్ ఇత‌నే..!

Cricketer Yash Paul: క్రికెట్ గేమ్ ఇప్పుడు అంద‌రికి చాలా ఎంట‌ర్‌టైనింగ్ గేమ్‌గా మారింది. క్రికెట‌ర్స్ త‌మ ఆట‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ర‌క్తి క‌ట్టిస్తున్న నేప‌థ్యంలో ఈ గేమ్‌కి విప‌రీత‌మైన ఆస‌క్తి పెరిగింది. అయితే క్రికెట‌ర్స్ త‌మ స్థానాన్ని ప‌దిలప‌రచుకోవాలంటే సెంచ‌రీలు చేయాలి, వికెట్స్ తీయాలి. కొన్ని మ్యాచ్‌ల‌లో బ్యాట్స్‌మెన్ నిరాశ‌గా వెనుదిర‌గ‌డం, బౌల‌ర్స్‌కి ఒక్క వికెట్ ద‌క్క‌క‌పోగా భారీగా ర‌న్స్ ఇచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి.

cricketer yash paul sharma
cricketer yash paul sharma

క్రికెట్‌లో ఉన్న రికార్డ్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత్య‌ధిక రన్స్, అత్యధిక సెంచ‌రీలు చేసిన‌వారు, ఎక్కువ వికెట్స్ తీసినవారు ఇలా ప‌లు రికార్డ్స్ ఉంటాయి. అలానే డ‌కౌట్ కాకుండా కూడా రికార్డ్ క్రియేట్ చేయాల‌ని చాలా మంది భావిస్తుంటారు. కాని అది చాలా క‌ష్టం. కెరీర్ మొత్తంలో ఎప్పుడో ఒక‌సారైన డ‌కౌట్‌గా వెనుదిరుగుతుంటారు. స్టార్ స్టార్ బ్యాట్స్‌మెన్స్ సైతం డ‌కౌట్ అయి పెవీలియ‌న్‌కి చేరిన సంద‌ర్భాలు ఉన్నాయి.

అయితే ఎన్నటికీ డకౌట్ కాకుండా కెరీర్ ను ముగించిన అరుదైన ప్లేయర్స్ కూడా ప్రపంచ క్రికెట్లో కొందరు ఉన్నారు. ఆ జాబితాలో మన ఇండియన్ బ్యాట్స్ మెన్ ఒక్కరే ఉన్నారు. ఆయనే యశ్ పాల్ శర్మ. జూలై 13న ఆయ‌న గుండెపోటుతో క‌న్నుమూశారు. 1983లో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో యశ్ పాల్ సభ్యుడు. అంతేకాదు.. ఆ విజయంలో యశ్ పాల్ పాత్ర కూడా అమోఘమైనది.

ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో యశ్ పాల్ 61 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ విధంగా ఫైనల్ వెళ్లిన టీమిండియా.. వెస్టిండీస్ పై కప్పు గెలిచి కల నెరవేర్చుకుంది. మొత్తం 42 అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడిన యశ్ పాల్.. 28.48 సగటుతో 883 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యశ్ పాల్ ఘనత ఏమంటే.. తన కెరీర్ ముగిసే నాటికి ఒక్కసారి కూడా డక్కౌట్ కాలేదు.

అప్ప‌ట్లో వెస్ట్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక వంటి దేశాల‌లో దిగ్గ‌జ బౌలర్స్ ఉన్నారు. వారంద‌రిని స‌మ‌ర్ధంగా ఎదుర్కొని ఒక్క‌సారి కూడా సున్న ప‌రుగుల‌కు ఔట్ కాలేదు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ గా యశ్ పాల్ చరిత్రలో నిలిచిపోయారు. 1978 లో పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన యశ్ పాల్.. 1984 వరకు మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్రపోషించారు. 1985లో తలకు గాయమవడంతో క్రికెట్ కు వీడ్కోలు పలికారు.