దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న KGF 2 టీజర్..రిలీజైన 5 నిమిషాల్లోనే భారీ రికార్డు

Mamatha 600 - January 7, 2021 / 10:33 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న KGF 2 టీజర్..రిలీజైన 5 నిమిషాల్లోనే భారీ రికార్డు

బాహుబలి తరువాత సౌత్ ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి తెలియ చేసిన సినిమా కెజిఎఫ్. రాకింగ్ స్థార్ యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కన్నడ మేడ్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి, అద్భుతాలను సృష్టించింది. యష్ కి ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ని తెచ్చి పెట్టింది.

 

దానితో ప్రస్తుతం తెరకెక్కుతున్న చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్, టాలీవుడ్ నటులు ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా దాదాపుగా రూ.350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్… హీరో యష్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉదయం రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే.., ఈ టీజర్ ముందుగానే లీక్ కావడంతో చిత్ర బృందం కూడా ఇక చేసేది ఏమి లేక టీజర్ ని అఫీషయల్ గా విడుదల చేసేసింది.

ఇక విడుదల అయిన కెజిఎఫ్ చాప్టర్ 2 అంచనాలను మించిపోయింది. చాప్టర్ 1 లో మాదిరిగానే ఇందులో కూడా అమ్మ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాఖీ చిన్నప్పుడు తన తల్లికి ఇచ్చిన మాటతో టీజర్ స్టార్ట్ అవ్వగా.., అక్కడ నుండి రాఖీ భాయ్ గా ఎలా ఎదిగాడు అన్నది కట్ షాట్స్ వేస్తూ.., ప్రశాంత్ నీల్ బాగా చూపించాడు. ఇక “పవర్ ఫుల్ పీపుల్ మేక్స్.. ప్లేసెస్ పవర్ ఫుల్” అంటూ టీజర్ లో ఉన్న డైలాగ్ సినిమాపై బజ్ అమాంతం పెంచేసింది. ఇక పవర్ ఫుల్ పీపుల్ అన్న సమయంలో ఇందిరా గాంధీ క్యారెక్టర్, విలన్ అధీరా క్యారెక్టర్ కనిపించడంతో… రాఖీ భాయ్.. చాఫ్టర్ 2 లో ఏకంగా ప్రభుత్వాన్నే ఢీ కొట్టబోతున్నాడని అర్ధం అవుతుంది. ఇక చివరలో పెద్ద గన్ తో.. జీబులను పేల్చేసి.., ఆ గన్ తోనే యష్ సిగరెట్ వెలిగించే షాట్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది.

హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక చాఫ్టర్ 1 లో లోనే ఇందులో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అన్న విషయం టీజర్ చూస్తే అర్ధం అయిపొయింది. సో… కెజిఎఫ్ ఫ్యాన్స్ కి కెజిఎఫ్ చాప్టర్ 2 ఫుల్ మాస్ మసాలా మీల్స్ అందించడం ఖాయం అని టీజర్ రుజువు చేసింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us