కంగనా రనౌత్ కు వై+ క్యాటగిరి సెక్యురిటిని కేటాయించిన కేంద్రం

Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లోని ప్రముఖుల వల్లే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతనికి మృతికి నిర్మాత కరణ్ జోహార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు కూడా కారణమని గతంలో ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు కేంద్ర ప్రభుత్వం Y+ క్యాటగిరి సెక్యురిటిని ఏర్పాటు చేసింది.

డ్రగ్స్ విషయంలో ప్రముఖుల పేర్లు బయటపెడుతా అన్నప్పటి నుండి ఆమె బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఆమెకు ఈ అధునాతన భద్రతను కలిపించింది. కంగనాకు వై+ క్యాటగిరి సెక్యురిటి కలిపించడంపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ స్పందిస్తూ… కంగన హిమాచల్‌ కుమార్తె. ఆమెకు ప్రాణాపాయం ఉన్నందున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేసిందని”వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here