వేలమందితో పార్టీలు చేసుకుంటున్న వూహాన్ వాసులు

Advertisement

ప్రపంచం మొత్తం కరోనాతో సతమతమవుతున్న తరుణంలో కరోనాకు కేంద్రబిందువు అయిన వూహాన్ లో జనాలు వాటర్ పార్క్ లలో పార్టీలు చేసుకుంటున్నారు. ఈ పార్టీలు చేసుకుంటున్న వారు కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా పార్టీలు చేసుకుంటున్నారు. ఈ పార్టీలలో సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు కూడా ధరించకుండా అక్కడి జనాలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మే నెల నుండి అక్కడ కొత్త కేసులు నమోదు కాకపోవడం వల్ల కరోనా ఆంక్షలు తొలగించారు. దీంతో అక్కడి వాటర్ పార్క్ లు స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.

ఇదిలాఉంటే, చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పటికే లక్షల మందిని బలితీసుకోవడంతోపాటు కోట్లమందికి సోకింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్‌ కేసులు చైనాలోనూ మరోసారి బయటపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే రెండో దఫా వైరస్‌ ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న నేపథ్యంలో వుహాన్‌వాసుల, అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here