Cheapest Car: ప్రపంచంలోనే అతి చౌకైన కారు ని ఏ సంవత్సరంలో కనిపెట్టారో తెలుసా..!!

Cheapest Car(చౌకైన కారు): ప్రపంచంలో కార్ కి ఉండే డిమాండ్ దీనికి ఉండదు.. కార్ కొనాలని దాన్ని నడపాలని అందులో ఫ్యామిలీని కూర్చోబెట్టుకుని తిరగాలని ప్రతి ఒక మధ్యతరగతి వ్యక్తి కి ఆశ ఉంటుంది.. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఎలా అయితే ఓ కల గా ఉంటుందో.. కార్ కొనడం కూడా అదే కల గా ఉంటుంది.. అలాంటి కార్ ఇప్పుడు తక్కువ కాలంలోనే మనకు లభిస్తుంది.. ఎంత మంచి కార్ కావాలి అనుకుంటే అంత ఎక్కువ డబ్బులు మనం పెట్టాల్సి వస్తుంది..

Worlds cheapest car invented by Indians : చౌకైన కారు
Worlds cheapest car invented by Indians

కానీ ఓ సగటు మధ్యతరగతి వ్యక్తి కనీస ధరను కూడా వెచ్చించలేని స్థితిలో ఉంటాడు కాబట్టి టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా లక్ష రూపాయలకే కారును అమలులోకి తెచ్చాడు.. దాంతో ఈ కార్ ను చాలా మంది అడ్వాన్సుగా బుక్ చేసుకుని కార్ నడపాలనే తమ కోరికను చాలామంది తీర్చుకున్నారు.. అయితే దాని క్వాలిటీ ఎలా ఉంది నాణ్యత ఎంత మేరకు ఉంది అనేది పక్కన పెడితే లక్ష రూపాయలకే అనేది అప్పట్లో ఒక సెన్సేషనల్ గా మిగిలిపోయింది..

ఇప్పుడు రతన్ టాటా ఈ కారును మధ్యతరగతి కుటుంబానికి అందించాలని ఆకాంక్షించారు.. కానీ ఈయన గంట ముందే శంకర్ కులకర్ణి అనే వ్యాపారవేత్త అతి తక్కువ ధరలోనే కారును ఆవిష్కరించారు.. 1970లో మీరా మినీ కార్ పేరిట 12 వేల రూపాయల ధరకే ఆవిష్కరించారు.. తొలి కారుని హెచ్ఎంఈ 192 పేరిట రిజిస్టర్ కూడా చేయించారు.. దురదృష్టవశాత్తు ఈ కారు అంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేదు..

Advertisement