ట్విట్టర్ లో వరల్డ్ రికార్డ్ ను సృష్టించిన పవన్ కళ్యాణ్ అభిమానులు

Advertisement

పవన కళ్యాణ్ అభిమానులు కొత్త రికార్డ్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డేకు సంబంధించిన కామన్ డీపీని ఈ రోజు పవన్ అభిమానులు విడుదల చేశారు. ఈ సీడీపీ ఇప్పుడు ట్విట్టర్ లో రికార్డ్స్ ను వేటాడుతుంది. కేవలం 79 నిమిషాల్లో 11 మిలియన్ ట్వీట్స్ పడ్డాయి. ఇది ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్ ను నమోదు చేశారు. మహేష్ బాబు అభిమానులు కూడా తమ హీరో బర్త్ డే సంధర్బంగా రికార్డ్స్ ను సృష్టించిన విషయం తెలిసిందే.

ఒక్కప్పుడు అభిమానులు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ను బీట్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు. అయితే ఇప్పుడు డిజిటల్ యుగంలో డిజిటల్ రికార్డ్స్ ని క్రియట్ చేయడానికి అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు క్రియేట్ చేసిన రికార్డ్స్ ను మహేష్ అభిమానులు బ్రేక్ చేశారు. ఇప్పుడు మహేష్ అభిమానులు క్రియేట్ చేసిన రికార్డ్ ను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు రికార్డ్ బ్రేక్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here