Gold : 2021లో 611 టన్నుల బంగారం కొన్న ఇండియా.. ఎక్కువగా కొంటుంది వారే..!
NQ Staff - January 21, 2023 / 09:54 AM IST

Gold : మన భారతీయులకు బంగారంపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. వారు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇతర దేశాలతో పోలిస్తే బంగారం కొనుగోలులో ఇండియా ఎప్పుడూ అగ్ర భాగననే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాగా ఇప్పుడు బంగారం కొనుగోలులో ఇండియా మరో రికార్డు సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా 2021లో బంగారం కొనుగోలుకు సంబంధించిన నివేదికను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసింది. ఇందులో చెప్పిన వివరాల ప్రకారం.. 2021 లో భారతీయులు 611 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. ప్రపంచంలో 673 టన్నుల బంగారం కొనుగోలుతో చైనా మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత మన ఇండియా ఉంది.
వృద్దులే అధికం..
మన దేశంలో ఎక్కువగా మధ్య తరగతి వారు బంగారాన్ని భవిష్యత్ పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తున్నారు. బంగారం కొనుగోలు, అమ్మకానికి ఎక్కువగా మధ్య తరగతి వారే కారణం అని ఈ నివేదిక సూచిస్తోంది. అయితే ఈ బంగారంపై పెట్టుబడి పెడుతున్నవారిలో ఎక్కువగా వృద్దులే ఉన్నారంట.
యువతరం ఈ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ఇక ఈ బంగారం కొనుగోళ్లలో ఎక్కువగా 22 క్యారెట్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. 18 క్యారెట్ల బంగారం అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని చెబుతోంది ఈ నివేదిక. ఇలాగే రాను రాను కొనసాగితే బంగారంపై పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.