కరోనా భయంతో ఆత్మహత్య హైదరాబాద్ లో దారుణం

Advertisement

కరోనా ఈ మాట వింటేనే ప్రతి ఒక్కరికి భయాందోళనకరంగా ఉంది. ప్రస్తుతం కరోనా దేశంలో విలయతాండవం చేస్తుంది. అయితే ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడుతున్నారు. కరోనా వచ్చిన వారిలో చాలా వరకు కోలుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా అంటే తీవ్రంగా భయపడుతున్నారు. ఇదే తరుణంలో కరోనా భయంతో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే హైదరబాద్ లోని షాపూర్ నగర్ లో నివాసం ఉంటున్న ఎలుగుపల్లి అనంతరెడ్డి, సుజాత సుమిత్రా ట్రేడర్స్ అనే కిరాణా షాప్ ను నిర్వహిస్తున్నారు. సుజాత నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధ పడుతుంది. దీనితో ఆమెకు టెస్టులు చేయించగా మలేరియా అని తేలింది. కాని తను మాత్రం కరోనా వచ్చింది అనే అపోహంతో ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here