మూడు పెళ్లిళ్లు చేసుకున్న లేడి కిలాడీ

Advertisement

ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు కొంతమంది అబ్బాయిలు. చాలా వరకు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. కానీ ఓ కిలాడీ మూడు పేర్లు పెట్టుకొని ఏకంగా ముగ్గురు యువకులను మోసం చేసింది. ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి కి చెందిన పతంగి స్వప్న అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమురారి స్వప్న ఈ మూడు పేర్లు పెట్టుకుంది ఈ మాయ లేడి. ఇక మూడు పేర్లు పెట్టుకొని ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది.

అయితే తెలుగు మాట్రిమోనీ వెబ్ సైట్ లో ఒక ఐపీఎస్ అధికారిగా బయోడేటా అప్ డేట్ చేసింది ఈ లేడీ.అయితే అమాయక అబ్బాయిలే ఈమె టార్గెట్ గా వాళ్ళను పెళ్లి చేసుకొని కొంతకాలానికి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటుంది.

గత సంవత్సరం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది స్వప్న. పెళ్లి చేసుకున్న తరువాత హైదరాబాద్ లో ఈ జంట కాపురం పెట్టింది. అయితే రామాంజనేయలు డెన్మార్క్ లో ఉద్యోగం చేస్తాడు. ఇక ఇద్దరు కలిసి డెన్మార్క్ వెళదామని స్వప్న పాసుపోర్టు అడిగాడు. దీనికి నిరాకరించిన స్వప్న తనకు ఇక్కడ పని ఉందని తప్పించుతుంది.

ఇక చేసేది ఏం లేక రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ కి వెళ్ళాడు. కొన్ని రోజుల తరువాత స్వప్న పై అనుమానం వచ్చింది.ఇక రామాంజనేయలు ఆమెపై రహస్యంగా తన గురించి తెలుసుకున్నాడు. అప్పుడు స్వప్న నిజ స్వరూపం బయట పడింది. అయితే రామాంజనేయలు కంటే ముందుగానే ఇద్దరినీ పెళ్లి చేసుకుందనే విషయాన్నీ తెలుసుకున్నాడు.

ఆ ఇద్దరిలో ఒకరేమో చిత్తూరు కి చెందిన పృద్వి రాజ్ మరియు ఇంకొక అతను ఆత్మకూరుకు చెందిన సుధాకర్ తో పెళ్లి అయిందని తెలుసున్నాడు. ఇక ఈ విషయం పై స్వప్నను నిలయదియగా.. స్వప్న తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ లో పృథ్వి పై కేసు పెట్టింది. అంతేకాకుండా పెళ్లి చేసుకున్నందుకు 30 లక్షలు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకోవాలి అని డిమాండ్ చేసింది స్వప్న.

ఇక స్వప్న మాటలకూ పృథ్వి లొంగకపోవడంతో దోనకొండ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అలాగే ఆమె పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ… పోలీసులు ఒక అమ్మాయి మీద దురుసుగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదని, అలాగే నాకు అన్యాయం జరిగిందని, రామాంజనేయులు నన్ను మోసం చేసాడని, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆరోపించింది. అలాగే నాకు రామాంజనేయులు మాట్రిమోనీ నుండి పరిచయం అయ్యాడని, నేను కెనడాలో ఎమ్మెస్సీ చదువుకున్ననని తెలిపింది.

ఒకవైపు పోలీసుల విచారణలో.. స్వప్నకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని తేలింది. అలాగే చీటింగ్ చేసి ముప్పై లక్షలు డిమాండ్ చేస్తుందని రామాంజనేయులు కుటుంబసభ్యులు తెలిపారు. అంతేకాకుండా స్వప్న నుండి తమ కుటుంబాన్ని కాపాడాలని ఆవేదన వ్యక్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here