భార్య చేసిన పనులకు కుటుంబం చిన్నాభిన్నం

Admin - October 22, 2020 / 11:19 AM IST

భార్య చేసిన పనులకు కుటుంబం చిన్నాభిన్నం
https://www.youtube.com/watch?v=Jd7M5bAw7es

ఒక ఇల్లాలు చేసిన పనికి తన కూతురు మరియు భర్త బలి అయ్యారు. తన భార్య వల్ల కూతురు చనిపోవడంతో ఒక పక్క పరువు మరో పక్క ప్రాణానికి ప్రాణం గా చూసుకున్న కన్న కూతురు ఇలా రెండు ఒక్క సారిగా దూరం అవ్వడం తో ఎం చెయ్యాలో తెలియక రైలు కింద పడి ఆత్మ హత్యా చేసుకున్నాడు ఆ ఇల్లాలి భర్త. పూర్తి వివరాల్లోకి వెళితే…

కళ్యాణ్ అనే వ్యక్తి భువనగిరిలో పంచాయితీ సెక్రటరీగా పని చేసేవాడు. అదే సమయం లో అనంతపురంలోని గుత్తికి చెందిన అనూష ప్రేమించి 2011 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిరువురి కి ఆధ్య అనే 6 సంవత్సరాల పాప ఉంది. పుట్టినప్పటి నుండి ఆధ్య అంటే కళ్యాణ్ కి పంచ ప్రాణాలు అందుకే తనని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవాడు. కళ్యాణ్ కుటుంబంతో సహా 3 సంవత్సరాల క్రితం పోచారం లోని ఇస్మాయిల్ ఖాన్ గూడ, విహారి హోమ్స్ కి మారి అక్కడే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలం క్రితం అనూష కి సెల్ ఫోన్ మరియు ఈఎంఐ ల విషయం లో కరుణాకర్ తో పరిచయం ఏర్పడి అది కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది.

అయితే కళ్యాణ్ ఆలా తన ఆఫీస్ కి వెళ్ళగానే కరుణాకర్ అనూష ఇంట్లో చొరబడేవాడు. ఆలా కరుణాకర్ ఒక్కడు మాత్రమే రాకుండా కొన్ని సార్లు అతని స్నేహితుడు అయిన రాజశేకర్ ని తోడు గా తీసుకు వస్తూ ఉండేవాడు. ఆ తరుణం లోనే కరుణాకర్ కి కూడా తెలియకుండా అనూష రాజశేఖర్ తో కూడా అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. ఒక రోజు అనూష ఇంటికి కరుణాకర్ వెళ్లగా అప్పటికే అక్కడ రాజశేఖర్ బండి మరియు చెప్పులు ఉండడం తో చెప్పులు, బైక్ ని గమనించి షాక్ తో పాటు ఆవేశానికి గురి అయ్యి ఇంట్లోకి ప్రవేశించాడు కరుణాకర్ . అక్కడ రాజశేఖర్ ని చూసి అనూష తో నువ్వు త్వరగా రాజ శేఖర్ ని ఇంట్లో నుండి బయటకి పంపకపోతే అనూష కూతురు అయిన ఆధ్య ని చంపేస్తానంటూ అరిచాడు. అయినప్పటికీ రాజ శేఖర్ బయటకు వెళ్ళకపోవడం తో కరుణాకర్ కత్తి తీసుకొని ఆ పాప గొంతు కోయగా అప్పటికప్పుడు అధ్యని హాస్పిటల్ కి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.

తీవ్ర రక్త స్రావం మరియు చిన్న పిల్ల అవ్వడం తో మార్గమద్యం లోనే ఆధ్య చనిపోయింది. ఇక ఆలా తన కోపం లో చేసిన పనికి సిగ్గు తో కరుణాకర్ కూడా తన గొంతు కోసుకున్నాడు. పాప మరణ వార్త విన్న కళ్యాణ్ ఒక్కసారిగా క్రుంగి పోయాడు. ఆ తరువాత పాప అంత్య క్రియలు అన్ని పూర్తిచేసి తన భార్య ని అనంతపురం లో కారులో దిగబెట్టాడు కళ్యాణ్. తిరుగు ప్రయాణం అయిన కళ్యాణ్ భువనగిరి చేరుకొని తన మనసేమి బాగోలేదని స్నేహితుడిని పిలిచి మద్యం సేవించాడు. పాప దూరం అయిన విషయాన్నీ ఎంతకీ తట్టుకోలేక ఆ తరువాత పిలిచిన స్నేహితుడు ని అతని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చి రైల్వే ట్రాక్ వద్ద అతను ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇలా ఒక ఇల్లాలి కామ వాంఛకు తన కూతురు మరియు భర్త ఇద్దరు బలి కావాల్సి వచ్చింది.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us