ప్రియుడితో కలిసి భర్తను చంపిన కసాయి భార్య
Admin - July 27, 2020 / 11:28 AM IST

ప్రియుడి మోజులో పడి ఏడడుగులు వేసిన భర్తనే చంపింది ఓ కసాయి భార్య. వివరాల్లోకి వెళితే ఖరాగపూర్ పట్టణంలోని నింపురా రైల్వే కాలనీ కి చెందిన ఎం.ఈశ్వరరావు (44) ఈ నెల 22వ తేదీన మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా గుండె పోటు తో చనిపోయాడని భావించారు.
ఇక దహన కార్యక్రమాలు అయిపోయిన తరువాత ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈశ్వరరావు గుండె పోటు తో చనిపోలేదని ఈశ్వరరావు కూతురు పెద్ద నాన్నవెంకటరమణ కు చెప్పింది. అలాగే తన తండ్రిని ప్రియుడి తో కలిసి తన తల్లే చంపింది అని తెలిపింది.ఈ విషయం తెలుసుకున్న వెంకటరమణ వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు.
పోలీసులు కేసును దర్యాప్తు చేసి విచారించగా నేరం ఋజువు అయింది. వెంటనే ఈశ్వరరావు భార్యతో సహా ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసారు. ఈశ్వరరావు అడ్డు తొలగించుకోవాలని ఈ నెల 21వ తేదీన రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఊపిరాడకుండా హత్య చేశారని, ఈ ఘటనను కుమార్తె చూసిందని పోలీసులు వెల్లడించారు. అలాగే నిందితులు ఇద్దరినీ కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.