ఓ మహిళ నలుగురు పిల్లలతో స్టేషన్ రైటర్ తో పరార్

Advertisement

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణమైన సంఘటన జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో రైటార్ గా విధులు నిర్వహిస్తున్నా శివ శంకర్ అనే పోలీసు ఓ మహిళతో పాటు నలుగురు పిల్లలను తీసుకొని పరార్ అయ్యాడు. దీనితో ఆ మహిళ భర్త షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్ నగర్ ప్రాంతం లో నివసిస్తున్న శివ శంకర్ కొందుర్గ్ పోలీస్ స్టేషన్ లో.. స్టేషన్ రైటర్ గా పని చేస్తున్నాడు. అయితే గత మూడు రోజుల నుంచి శివ శంకర్ కనబడడం లేదని అతని భార్య పోలీసుల కు సమాచారం ఇచ్చింది.

ఇంతలోనే ఓ మహిళ మిస్సింగ్ అయినట్లు ఆ మహిళ భర్త షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే ఆ ఫిర్యాదులో తన ఇద్దరు పిల్లలతో పాటు తన భార్యను కూడా శివ శంకర్ తీసుకెళ్లినట్టు పిర్యాదులో నమోదు చేసాడు. అలాగే తమ పిల్లలు కూడా లేరని శివ శంకర్ భార్య పోలీసుల కు తెలిపింది. దీనితో పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here