Viral News : దారుణం : సంతానం కోసం స్మశానంలోని అస్తికలను మహిళతో తినిపించారు
NQ Staff - January 21, 2023 / 05:47 PM IST

Viral News : మహారాష్ట్రలో దారుణ సంఘటన జరిగింది. పిల్లలు పుడతారనే ఉద్దేశంతో ఒక మహిళ ను ఆమె భర్త మరియు మరుదులు కలిసి స్మశానంలో హస్తికలను తినిపించేందుకు ప్రయత్నించారు. మూఢ నమ్మకాలతో పిల్లలపై ఆశతో ఆ మహిళను అత్యంత దారుణమైన చిత్రహింసలకు గురి చేశారట.
పూర్తి వివరాల్లోకి వెళితే పూణె శివారు ప్రాంతానికి చెందిన బాధితురాలు అత్తింటి వారిపై ఫిర్యాదు చేసింది. అమావాస్య రాత్రుల్లో స్మశానానికి తీసుకు వెళ్లి అక్కడ హస్తికలు తినిపించేవారని, చేతబడి చేసే వ్యక్తులు చెప్పిన విధంగా నాతో వికృతమైన పనులు చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహారాష్ట్ర కొంకన్ ప్రాంతానికి తీసుకెళ్లి అఘోరాలతో పూజలు చేయించారని, ఒక జలపాతం క్రింద చేతబడి చేయించి అక్కడ నాతో అత్యంత దారుణంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది.
మాంత్రికుడికి వీడియో కాల్ చేసి సూచనలు చేసే విధంగా నా భర్త మరియు మరుదులు నన్ను స్మశానానికి తీసుకెళ్లి అస్తికలు తినిపించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 2019లో పెళ్లి అయింది, అప్పటి నుండి పిల్లలు కలగటం లేదని నన్ను శారీరకంగా మానసికంగా అత్యంత దారుణంగా వారు వేధిస్తున్నారని క్షుద్ర పూజలు చేస్తే పిల్లలు పుడతారని నాతో అత్యంత అసహ్యకరమైన పనులు చేయించారని కన్నీళ్లు పెట్టుకుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్తను మరియు మరుదులను అరెస్టు చేయడం జరిగింది.