Viral News : ఎయిర్ పోర్టులో కదులుతున్న మహిళ బ్యాగ్.. తెరిచి చూస్తే దిమ్మతిరిగే షాక్..!

NQ Staff - May 1, 2023 / 09:25 AM IST

Viral News : ఎయిర్ పోర్టులో కదులుతున్న మహిళ బ్యాగ్.. తెరిచి చూస్తే దిమ్మతిరిగే షాక్..!

Viral News : అవును.. మీరు విన్నది నిజమే. ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే ఏదైనా ఖరీదైన బట్టలు లేదంటే ఇతర వస్తువులు తెచ్చుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం దీనికి చాలా భిన్నంగా ఓ మహిళ ఏకంగా పాములను వెంట తెచ్చుకుంది. ఈ ఘటన చెన్నై ఎయిర్ పోర్టులో సంచలనం రేపింది.

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఓ మహిళ చెన్నైకు విమానంలో వచ్చింది. కాగా చెన్నై ఎయిర్ పోర్టులో అధికారులకు ఆమె వద్ద ఉన్న ఓ బ్యాగు మీద అనుమానం వచ్చింది. ఆ బ్యాగులో ఏదో కదులుతున్నట్టు వారు గుర్తించారు. కొంపదీసీ అందులో ఎవరైనా మనుషులు ఉన్నారా అనే అనుమానంతో తెరిచి చూశారు.

కానీ అందులో ఉన్నది చూసి అందరూ షాక్ అయిపోయారు. ఆ బ్యాగు నిండా పాములే ఉన్నాయి. అది చూసి అధికారులు ఆ బ్యాగు నుంచి దూరంగా పారిపోయారు. ఎయిర్ పోర్టులో పాములు తిరగడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. వెంటనే పాములను పట్టే వారిని పిలిపించి మొత్తం పాములను పట్టించారు.

లెక్క తీస్తే 22 పాములు ఉన్నట్టు గుర్తించారు. చట్ట విరుద్దంగా పాములను తీసుకు వస్తున్న ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పాములను జూకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళకు ఈ పాముల పిచ్చి ఏంటో అని అందరూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా మలేషియా అంటేనే పాములకు ఫేమస్. మరి ఆ మహిళ కూడా పాముల లవర్ ఏమో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us