Woman : ఒకే తల్లి కడుపున.. వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు.!
NQ Staff - January 8, 2023 / 10:18 AM IST
Woman : అదేంటీ, కవలలంటే ఒకే సారి.. కొన్ని నిమిషాల వ్యవధిలో పుడతారు కదా.! కానీ, ఆ ఇద్దరూ కవలలే.. కాకపోతే, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. ఒకరు ఓ సంవత్సరంలో, ఇంకొకరు ఇంకో సంవత్సరంలో పుట్టారు. పుట్టిన ఇద్దరూ అమ్మాయిలే.
అమెరికాలోని టెక్సాస్‌కి చెందిన ఓ మహిళ ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మొదటి కుమార్తె ఓ ఏడాదిలో జన్మిస్తే, రెండో కుమార్తె ఇంకో ఏడాదిలో పుట్టింది.
ఇదెలా సాధ్యం.?
అసలు విషయం వేరే వుంది. ఆ మహిళలకు డిసెంబర్ 31న డెలివరీ అయ్యింది. అదీ అసలు సంగతి. సరిగ్గా అర్థరాత్రి 11.55 నిమిషాలకు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిందామె.
మరో ఆరు నిమిషాల తర్వాత.. అంటే, 12.01 నిమిషాలకు.. అనగా జనవరి 1న ఇంకో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సో, పెద్ద కూతురు 2022లో జన్మిస్తే, చిన్న కూతురు 2023లో జన్మించిందన్నమాట. చాలా అరుదుగా జరుగుతుంటాయి ఇలాంటి విషయాలు.