Smriti Mandhana: స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న మ‌హిళా క్రికెట‌ర్..!

Smriti Mandhana: ప్ర‌స్తుతం మ‌న దేశంలో క్రికెట్‌కి ఎంత క్రేజ్ ఏర్ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.చిన్న పిల్లాడి నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు టైమ్ పాస్ గేమ్ క్రికెట్ అయింది. ఇక టీవీల‌లో క్రికెట్ మ్యాచ్‌లు వ‌స్తున్నాయంటే మ‌రో ఛానెల్ కూడా మార్చే ప‌ని ఉండ‌దు. పురుషుల క్రికెట్‌కే కాకుండా ఉమెన్స్ క్రికెట్‌కు కూడా మంచి క్రేజ్ ఏర్ప‌డింది.అంద‌మైన అమ్మాయిల‌తో కూడిన భార‌త మ‌హిళల క్రికెట్ జ‌ట్టు మంచి విజ‌యాలు సాధిస్తుండ‌డంతో ప్రేక్ష‌కుల‌కి ఈ టీమ్ మ్యాచ్‌ల‌పై కూడా ఆస‌క్తి నెల‌కొంది.

Smriti Mandhana

అయితే మ‌హిళా క్రికెట్ టీంలో స్మృతి మంధానకి ఎనలేని క్రేజ్ ఉంది . హీరోయిన్‌లా క‌నిపించే ఈ ముద్దుగుమ్మ జులై 18, 1996 న ముంబైలో జన్మించింది. తన బ్యాటింగ్ తో పాటు అందంతో కుర్ర‌కారుకి వ‌ల వేస్తుంది. ఉమెన్స్ క్రికెట‌ర్స్‌లో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధానా . చిన్న వ‌య‌స్సులోనే ఈమె తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు క్రికెట్ మ‌రో వైపు బిజినెస్‌తో అంద‌రికి షాక్ ఇస్తుంది.

నైకీ ఒప్పందంతో మరింత పైకి చేరుకున్నస్మృతి ఏడాదికి కనీసం కోటీ రూపాయ‌ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని టాక్. స్టార్‌డమ్‌ నెట్‌వర్త్‌ డాట్‌ కామ్‌ అంచనా ప్రకారం చిన్న వయసులోనే అమిత సంపన్నురాలైన మహిళా క్రికెట్‌ ప్లేయర్‌ 25 ఏళ్ల స్మృతీ మంధాన. క్రికెట‌ర్‌గా కూడా స్మృతి బాగానే సంపాదిస్తుది. బీసీసీఐ నుంచి జీతంగా ఏడాదికి 50 లక్షల రూపాయలు అందుతాయి. మొత్తంగా స్మృతి ప్రస్తుత ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయలని ఇటీవ‌ల ఓ సంస్థ వెల్ల‌డించింది.

Smriti Mandhana

మ‌రోవైపు స్మృతి మహారాష్ట్రలోని ఆమె స్వస్థలం సంగ్లీలో “ఎస్‌.ఎం.18” అని ఆమె ఒక కేఫ్‌ నడుపుతున్నారు.ఇది బాగానే లాభాలు గ‌డిస్తుంది.అలానే . ఎయిర్‌ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్‌ బుల్, హీరో మోటార్స్‌.. వీటినుంచి వచ్చే ప్రచార ధనం ఎటూ ఉంది. ఈ అమ్మ‌డు సినిమాలు తెగ చూస్తుంద‌ట‌. బాలీవుడ్ హీరో హృతిక్ కోష‌న్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, చిన్న‌ప్పుడు హృతిక్‌ని పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు క‌నేది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్మృతి మంధాన ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు పొందింది. ఇంత ఫాలోవ‌ర్స్ ఉన్న‌ ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధాననే.అంతే గాక ఆమె ఫ్యాన్స్ బాలీవుడ్ హీరోయిన్స్ తో స్మృతి మంధానని కంపేర్ చేస్తూ ఉంటారు.