మూడేళ్ళ కూతురు తో బావిలో దూకిన మహిళా

Advertisement

కరీంనగర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన రాయిశెట్టి రమ్య (36), ఆమె మూడేళ్ళ కూతురు శ్రీనిఖతో కలిసి గ్రామ శివారులోని ఓ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. అయితే రమ్య గత కొంత కాలంగా వీణవంకలో దగ్గరి బంధువులకు చెందిన మీసేవ కేంద్రంలో పని చేస్తుంది. అయితే గురువారం తన కూతురు ఆరోగ్యం బాగా లేదని మీసేవా కేంద్రానికి రాలేనని సమాచారం ఇచ్చింది. ఇక వారికి విషయం తెలిపి ఆసుపత్రికి వెలుతున్నట్లు ఇంటి నుండి బయటకు వెళ్ళింది.

ఇక ఎవరు ఊహించని విధంగా బావిలో దూకి మృతి చెందినట్లు గ్రామస్థులు వివరించారు. అయితే రమ్య భర్త శ్రీనివాస్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరు దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. గత కొద్దిరోజులుగా కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగానే రమ్య తన కూతురుతో సహ బావిలో దూకి మృతి చెందినదని గ్రామస్థులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here