యువకుడి పై ఆసిడ్ తో దాడి చేసిన యువతి

Advertisement

ప్రేమ పేరుతో నిత్యం జరుగుతున్న అకృత్యాలకు అంతే లేదు. ప్రేమ ఒప్పుకున్నాక మోసం చేసేవారు కొంతమంది అయితే ఒప్పుకోకపోతే దాడులు చేసేవారు కొందరు. కర్నూల్ జిల్లాలోని నంద్యాల మండలంలో నాగేంద్ర అనే యువకుడి పై ఒక యువతి ఆసిడ్ తో దాడి చేసింది. ఈ ఘటనలో నాగేంద్రకు ముఖంపై గాయాలయ్యాయి. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. వారం క్రితమే నాగేంద్ర పై యాసిడ్‌ దాడి జరగ్గా అప్పట్లో చేతికి తీవ్రగాయాలయ్యాయి.

గతంలో తనను ప్రేమించిన యువతే ఈ దారుణానికి పాల్పడిందని నాగేంద్ర తెలిపారు. తనను కాకుండా వేరే యువతిని పెళ్లి చూసుకున్నాననే కక్షతోనే ఇలా ఆసిడ్ తో దాడి చేసిందని నాగేంద్ర తెలిపారు. ఈ మేరకు నంద్యాల గ్రామీణ సీఐ దివాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ఈ ఘటనలో గాయపడ్డ యువకుడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని, ఇందుకు కారణమైన యువతిని అరెస్ట్ చేస్తామని దివాకర్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here