Wine Shops : అలెర్ట్.. హైదరాబాదులో రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్..!
NQ Staff - March 5, 2023 / 11:10 AM IST

Wine Shops : హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్ కాబోతున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వైన్స్ దుకాణాలు మొత్తం బంద్ చేయిస్తున్నట్టు సీపీ డీఎస్ చౌహాన్ వివరించారు. హోలీ సందర్భంగా రాచకొండ పరిధిలో ఈ నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
మార్చి 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8వ తేదీ ఉదయం వరకు వైన్ షాపులు బంద్ చేయనున్నట్లు రాచకొండ కమిషనర్ వివరించారు. పండగ సందర్భంగా సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు సీపీ.
ప్రజలందరూ ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని.. ఎలాంటి గొడవలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సీపీ చౌహాన్.