RGV : ఆర్జీవీ ‘వ్యూహం’లో ఆ సీన్లు వుంటాయా.?

NQ Staff - December 17, 2022 / 12:50 PM IST

RGV : ఆర్జీవీ ‘వ్యూహం’లో ఆ సీన్లు వుంటాయా.?

RGV : రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ పేరుతో ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. జనవరి 26న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందట.. అదే రోజు నుంచి రెగ్యులర్ షూట్ కూడా షురూ కాబోతోందిట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంఘట నుంచి తెలుగునాట రాజకీయాల గురించి ఈ సినిమాలో ఆర్జీవీ తన కోణాన్ని చూపించబోతున్నాడట.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇదే విషయమై ఆర్జీవీ కలిసిన సంగతి తెలిసిందే. ఇంతకీ, ‘వ్యూహం’ సినిమాలో ఏముండబోతోంది.? ఇంకేముంటుంది.? వైసీపీకి అనుకూలమైన కంటెంట్ వుంటుంది. అంతకు మించి అనుకోవడానికేమీ వుండదా.? అంటే, వుంటాయ్.. చాలా వుంటాయ్.!

వర్మ రూటే సెపరేటు…

ఇంతకీ, ఆర్జీవీ ‘వ్యూహం’ ఎలా వుండబోతోంది.? వైసీపీనే ఈ సినిమాని స్పాన్సర్ చేయనుంది. వైసీపీ కీలక నేత ఒకరు ఈ సినిమా కోసం ఖర్చు చేయబోతున్నారు.. నిర్మాతగా ఆయన పేరు వస్తుందా.? లేదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

వైఎస్ జగన్ సంతకాల సేకరణ, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం.. ఇవన్నీ ఆర్జీవీ ‘వ్యూహం’లో వుంటాయా.? అసలు ఆ హెలికాప్టర్ ప్రమాదంపై వైఎస్ షర్మిల ఇటీవల వ్యక్తం చేసిన అనుమానాల సంగతేంటి.? ఏమో, ఆర్జీవీ ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us