David Warner: స‌న్‌రైజ‌ర్స్‌కి వార్న‌ర్ గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మా.. ఏ జ‌ట్టులో చేర‌నున్నాడు..!

David Warner: ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ ఐపీఎల్‌లో గ‌త కొద్ది రోజులుగా స‌న్‌రైజ‌ర్స్‌కి ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఐపీఎల్‌లో 5449 ప‌రుగులు చేయ‌డంతోపాటు స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల్లో కీల‌క‌పాత్ర పోషించిన వార్న‌ర్.. ఈ సీజ‌న్‌లో ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 8 మ్యాచ్‌ల‌లో కేవ‌లం 195 ప‌రుగులే చేశాడు. దీంతో ఇక అత‌న్ని ఈ సీజ‌న్‌లో మొత్తంగా హోట‌ల్ రూమ్‌కే ప‌రిమితం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

will david warner relieve from sunrisers hyderabad team
will david warner relieve from sunrisers hyderabad team

ఎలాగూ టీమ్ ఫైన‌ల్ చేరే అవ‌కాశం లేదు కాబ‌ట్టి సాధ్య‌మైనంత వ‌ర‌కూ యువ‌కుల‌కు చాన్సివ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు కోచ్ బేలిస్ చెప్పాడు. ఇక మెగా వేలం రానున్న నేప‌థ్యంలో వార్న‌ర్‌ను టీమ్‌తోపాటు కొన‌సాగిస్తారా లేదా అన్న‌దానిపైనా బేలిస్ స్ప‌ష్టంగా చెప్ప‌లేదు.అయితే హైద‌రాబాద్ జ‌ట్టుతో ఆడుతూ వ‌చ్చిన వార్న‌ర్ కొన్నాళ్లుగా ఇక్క‌డి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు.

2014 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన వార్నర్ 2015 కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు. 2016 లో హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ కప్ ని అందించాడు. తన అద్భుత బ్యాటింగ్ తో మూడుసార్లు(2015, 2017,2019) ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు డేవిడ్. తాజాగా ఐపీఎల్ 2021 మొదటి ఫేజ్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన వార్నర్ ను కెప్టెన్సీ నుండి తొలగించడమే కాకుండా తుదిజట్టులో స్థానం కూడా కల్పించకపోవడం హైదరాబాద్ జట్టు అభిమానులను నిరాశపరిచింది.

రెండో ఫేజ్‌లో వార్న‌ర్ దారుణంగా నిరాశ‌ప‌ర‌చిన సంగ‌తి తెలిసిందే. మొదటి మ్యాచ్ లో సున్నా పరుగులకు, రెండో మ్యాచ్ లో 2 పరుగులకు ఔటై అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. సన్ రైసర్స్ జట్టుకు ప్లేఆఫ్ కి వెళ్ళే అవకాశాలు లేకపోవడంతో ఇక రానున్న మ్యాచ్ లలో వార్నర్ ని పక్కనపెట్టె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ సీజన్ తో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 2022 కోసం రిటైన్ ఆప్షన్ లో హైదరాబాద్ జట్టు విదేశీ ఆటగాళ్ళ లిస్టులో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ ని రిటైన్ చేసుకోనుంది. దీంతో డేవిడ్ వార్నర్ కోసం బెంగుళూరు జట్టు త్వరలో జరగబోయే పెద్ద మొత్తంలో వేలం పాటలో చెల్లించి జట్టులోకి తీసుకోడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.