భార్య కి కరోనా అని భర్త పరార్ , ఊపిరాడక భార్య మృతి

Advertisement

కరోనా ప్రతిఒక్కరిని హడలెత్తిస్తుంది. అయితే ఈ మహమ్మారి సోకిందంటే ఎంత దగ్గరి సంబంధం అయిన సరే దూరంగా ఉంటున్నారు. అయితే ఇదే తరుణంలో భార్యకు కరోనా వచ్చింది అని అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త ఇంటి నుండి పారిపోయాడు. చివరకు ఆ అభాగ్యురాలు వైద్యం అందక మృతి చెందింది. ఆమెను కడసారి చూడడానికి కూడా ఆ కసాయి భర్త రాలే­దు. కరోనాపై ఉన్న అపో­హల వలన మానవ సంబంధాలు అన్ని కూడా మట్టి లో కలిసి పోతున్నాయి అనే మాటకు ఈ సంఘటనే నిదర్శనం.

వివరాల్లో కి వెళితే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది. బెంగుళూర్ నగరానికి చెందిన గౌరి, మంజునాథ్‌ లు రెండేళ్ల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి ఉపాధి కోసం వచ్చి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఇక భార్య ఒక షాపింగ్‌ మాల్‌లో సేల్స్‌ ఉమెన్‌గా పని చేస్తుంది. భర్త మంజునాధ్ ఏమో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే బుధవారం ఆమెకు జ్వరం వస్తే, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చారు. ఇంతలో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని ఆసుపత్రి సిబ్బంది ఫోన్‌ చేసి చెప్పారు.

దీనితో భర్త మరుక్షణమే భార్యను వదిలిపెట్టి పరారయ్యాడు. అయితే ఆమెకు శ్వాసకోశ సమస్య అధికంగా ఉండేది. దీనితో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనితో ఆమె శుక్రవారం ఇంట్లోనే దయనీయక స్థితిలో మృతి చెందింది. ఒకవైపు ఇంటి యజమాని, స్థానికులు మంజునాథ్‌కు ఫోన్‌ చేసినప్పటికీ కనీసం స్పందించకపోగా, చివరికి తన ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. ఇక మృతురాలి బంధువులకు సమాచారం ఇవ్వగా.. ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్లిన రోజే తనతో సంబంధం తెగిపోయిందని చెప్పారు. చివరకు స్థానిక నాయకుల చొరవ మేరకు అంబులెన్సు రప్పించి ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here