Murder Case : అన్నంలో చీమలు పడ్డాయని అడిగిన భర్త.! పతి ప్రాణ భార్య.!
NQ Staff - November 27, 2022 / 02:48 PM IST

Murder Case : పది రూపాయల కోసం హత్యలు జరుగుతున్న రోజులివి. చిన్న చిన్న మనస్పర్ధలకు ప్రాణాలు తీసేస్తున్న కలికాలమిది.!
కాదేదీ హత్యకనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి. ప్రియుడితో జీవించడం కోసం, కట్టుకున్న భర్తని చంపేసిన భార్యల్ని చూస్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యని చంపేసిన భర్తల వ్యవహారాలూ చాలానే కనిపిస్తున్నాయి.
అన్నంలో చీమలు..
ఒరిస్సా రాష్ట్రంలో ఓ భార్య చేసిన పని ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఒరిస్సా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఓ భార్య, తన భర్తను చంపేసింది. కారణమేంటో తెలుసా.? అన్నంలో చీమలు.!
అన్నంలోకి చీమలెలా వచ్చాయ్.? అని పాపం ఆ భర్త అడిగాడంతే. ఒళ్ళు మండిపోయిన భార్య, అతన్ని చంపేసింది. ఆగండాగండీ.. భర్త చీమల గురించి అడగడానికీ, భార్య అతన్ని చంపేయడానికీ మధ్య చిన్నపాటి ఘర్షన కూడా చోటు చేసుకుంది.

Wife And Husband Murder Case
చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.. ప్రాణం తీసేదాకా వెళ్ళింది. క్షణికావేశంలో భార్య, భర్త గొంతు నులిమి చంపేసిందని విచారణలో తేలింది. నిందితురాలు సరితను అరెస్ట్ చేశారు. మృతుడు హేమంత్ బాగ్ తల్లిదండ్రులు, తన కుమారుడ్ని చంపేసిన రాక్షురాలికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.