లంచం తీసుకున్న ఘటనల్లో ఏసీబీ అధికారులు పింక్ కలర్ ద్రావణాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా..!!

మన దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా నో , ఇంకే రోగమో కాదు.. లంచం.. ఏ జబ్బు అయినా కొన్ని రోజులకో, కొన్ని సంవత్సరాలకో పోతుంది .. కానీ లంచం అనే మహమ్మారి మాత్రం దశాబ్దాలు గడుస్తున్నా కొద్దీ ఇంకా ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది.. ఎన్ని సినిమాలు వచ్చినా ఎంత మంది రాజకీయ నాయకులు చెప్పిన కూడా ప్రభుత్వ రంగంలో ఉండే అధికారులు లంచం తీసుకోకుండా ఉండలేకపోతున్నారు.. లంచం తీసుకుంటే ఉద్యోగాలు పోతాయని తెలిసినా, వారు ఈ లంచాలకు అలవాటు పడి పోతూ ప్రజలను నానా కష్టాలు పెడుతున్నారు.

why this pink color liquid in bribes cases
why this pink color liquid in bribes cases

లంచం తీసుకునే వారి పట్ల యమకింకరులు గా తయారయ్యారు ఏసీబీ అధికారులు.. ఎంతో చాకచక్యంగా వారిపై స్టింగ్ ఆపరేషన్లు చేస్తూ వారి అక్రమాలను దౌర్జన్యాలను ప్రపంచం వెలుగులోకి తీసుకువస్తున్నారు.. అయితే ఈ లంచగొండుల బండారం బయట పెట్టినప్పుడు వారి అవినీతి సంపాదన తో పాటు పింక్ కలర్ ద్రావణాలను కూడా ప్రవేశపెడతారు.. మీరు గమనిస్తే ఈ పింక్ కలర్ ద్రావణాలను చూడొచ్చు.. అసలు అవి ఎందుకు పెడతారు..

ఏసీబీ అధికారులు ఏదైనా స్ట్రింగ్ ఆపరేషన్ చేసినప్పుడు సదరు బాధితులు లంచంగా ఇవ్వబోయే డబ్బును వీరే బాధితులకు ఇచ్చి అధికారులకు ఇవ్వమంటారు.. అప్పుడు ఆ నోటు పై అనే ఫైనాఫ్తలిన్ పౌడర్ ను చల్లి బాధితులకు ఇవ్వగా వారు అధికారులకు డబ్బులు ఇస్తే ఏసీబీ అధికారులు అధికారులు పట్టుకోడానికి వీలుగా ఉంటుంది.. లంచం తీసుకున్న అధికారులను పట్టుకోగానే ఏసీబీ అధికారులు సదరు లంచం తీసుకున్న అధికారి చేయిని సోడియం బైకార్బొనేట్ ద్రావణంలో ముంచుతారు..అప్పటికే లంచం తీసుకున్న అధికారి చేతికి ఫినాఫ్తలిన్ అనే పౌడర్ ఉండడం వల్ల ఈ సోడియం బై కార్బోనేట్ ద్రావణం పింక్ కలర్ లో మారుతుంది.. ఆ విధంగా అధికారి లంచం తీసుకున్నాడని గుర్తుపడతారు.. అందుకే ఇలాంటి కేసుల్లో పింక్ కలర్ ద్రావణాలు మనకు ఎక్కువగా దర్శనమిస్తాయి..

Advertisement