సురేష్ రైనా ఐపీల్ ను ఎందుకు ఆడటం లేదో తెలుసా!

Advertisement

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడేందుకు యూఏఈ వెళ్లిన రైనా.. భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. రైనా ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆడడం లేదని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ ట్వీట్‌ చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఇప్పటికే యూఏఈ నుంచి భారత్‌కు తిరుగు పయనమయ్యాడని చెప్పారు. అందుకు కారణాన్ని ఆయన వెల్లడించనప్పటికీ ఇప్పుడు ఆ కారణం బయటపడింది.
ఒక దొంగల ముఠా చేసిన దాడిలో రైనా బంధువు మరణించడం వల్లే ఐపీల్ ఆడకుండా రైనా వెనక్కి వచ్చారని సమాచారం.

పంజాబ్‌లోని పఠాన్‌కోఠ్‌ జిల్లాలో థరియాల్‌ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన అశోక్‌ కుమార్‌ (58) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో దోపిడీ దొంగలు ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులపై దాడి జరపగా.. అశోక్‌కుమార్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తల్లి సత్యదేవి (80), భార్య ఆశాదేవి, కుమారులు అపిన్‌, కౌశల్‌ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అశోక్‌ కుమార్‌ మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అశోక్ ను మరణించడం వల్లే రైనా ఇండియాకు తిరిగి వచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here