Adipurush : ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో ఏం జరిగింది? ఎందుకు షూటింగ్ ను మూవీ యూనిట్ ఆపేసింది?

Adipurush : ఆదిపురుష్ సినిమా తెలుసు కదా. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అది. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది కానీ.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా సినిమా విడుదలను వాయిదా వేసింది మూవీ యూనిట్. ప్రభాస్ ఇక తన మరో సినిమా ఆదిపురుష్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ప్రభాస్ కూడా అన్ని రకాలుగా సినిమా షూటింగ్ కోసం సిద్ధమయ్యారు. రాబోయే కొన్ని నెలల పాటు ఆదిపురుష్ సినిమా షూటింగ్ లోనే ప్రభాస్ బిజీగా గడపనున్నారు.

why prabhas adipurush movie shooting getting obstructions
why prabhas adipurush movie shooting getting obstructions

ఈసినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమాను గత సంవత్సరమే ప్రకటించారు. అయితే.. సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమాకు ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది. ఆ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా… రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే.. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన రోజే ఫైర్ యాక్సిడెంట్ అయింది. అలాగే.. సైఫ్ అలీ ఖాన్ కూడా రావణుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి.

ఇలా ఒకదాని వెంట మరోటి.. ఆదిపురుష్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సరే.. అవన్నీ వదిలేసి సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభిద్దాం అని అనుకునే లోపే ముంబైలో లాక్ డౌన్ విధించారు. సరే.. హైదరాబాద్ లో షూటింగ్ చేద్దామని.. హైదరాబాద్ కు మూవీ యూనిట్ షిఫ్ట్ అయితే.. ఇక్కడికి రాగానే సినిమా షూటింగ్ లను బంద్ చేశారు. ఇక్కడ కూడా లాక్ డౌన్ ను ప్రభుత్వం విధించింది. దీంతో.. సినిమా షూటింగే ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఇలా.. సినిమా షూటింగ్ ప్రారంభించే సమయానికి ఏదో ఒక అవాంతరం ఎదురవుతుండటంతో.. సినిమాకు ఏదో దోషం ఉందని.. దర్శకనిర్మాతలు భావించారట.

అందుకే… మంచి పండితుల సలహా తీసుకొని.. సినిమా షూటింగ్ కు వస్తున్న అవాంతరాలను దాటుకునేందుకు.. హోమం చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట. హోమం చేసి.. సినిమా షూటింగ్ ప్రారంభిస్తే.. ఇక ఏ అవాంతరాలు రావని పండితులు మూవీ యూనిట్ కు చెప్పారట. దీంతో త్వరలో హోమం జరిపించి.. మరోసారి ఫ్రెష్ గా సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని మూవీ యూనిట్ భావిస్తోందట. చూద్దాం మరి హోమం చేస్తే అన్నా ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందో లేదో వేచి చూడాలి.